Rains : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో సెప్టెంబర్ 2న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో భారీ వర్షం కారణంగా అనేక మంది మరణించారు. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సైతం నిలిచిపోయాయి.
దక్షిణ-మధ్య రైల్వే నెట్‌వర్క్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాక్‌లు నీటితో నిండిపోవడంతో 99 రైళ్లు రద్దు అయ్యాయి. 54 రైళ్లు దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వేర్వేరు వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
భారీ వర్షాల తర్వాత తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కూడా నీరు నిలిచిపోవడంతో సెప్టెంబర్ 2వ తేదీన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి వర్ష ప్రభావం, సహాయక చర్యలపై అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
భారి వర్షాలకు 17,000 మంది బాధిత ప్రజలను 107 సహాయ శిబిరాలకు తరలించామని, 1.1 లక్షల హెక్టార్ల వ్యవసాయ క్షేత్రాలు, 7,360 హెక్టార్లలో ఉద్యానవన క్షేత్రాలు దెబ్బతిన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ, గుంటూరు నగరాలు పూర్తిగా అతలాకుతలమైపోయాయని అన్నారు. రాష్ట్రంలో మరో 21 రైళ్లు రద్దు చేయగా, 10 రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ-మధ్య రైల్వే అధికారి తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 26 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలను మోహరించారు. రెండు రాష్ట్రాల్లో వరద సహాయం మరియు రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం పంపుతున్నారు.
ఏపీ, తెలంగాణలో నైరుతీ రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయి. వాయుగుండం ఈ గాలులను మరింత చల్లగా మార్చింది. అలాగే తూర్పు ఆసియా నుంచి వస్తున్న గాలులు మేఘాలను మోసుకొస్తున్నాయి. అందువల్ల ఓ వారం రోజుల పాటూ తెలుగు రాష్ట్రాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కోస్తా తీర ప్రాంతం వెంట రోజంతా వర్షం పడనుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.