Revanth Reddy – YS Jagan : జగన్ సన్నిహితులకు మంత్రి పదవి ఇచ్చిన రేవంత్ రెడ్డి.. షాక్ లో చంద్రబాబు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy – YS Jagan : జగన్ సన్నిహితులకు మంత్రి పదవి ఇచ్చిన రేవంత్ రెడ్డి.. షాక్ లో చంద్రబాబు

 Authored By kranthi | The Telugu News | Updated on :10 December 2023,2:30 pm

ప్రధానాంశాలు:

  •  పొంగులేటి, కొండా సురేఖ జగన్ కు ఆప్తులు

  •  వైఎస్సార్ కు భట్టి, ఉత్తమ్, సీతక్క ఆప్తులు

  •  తెలంగాణ మంత్రివర్గం అంతా వైఎస్ కుటుంబానికి సన్నిహితులే

Revanth Reddy – YS Jagan :  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగియడం, ఫలితాలు రావడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అన్నీ క్షణాల్లో జరిగినట్టుగా అనిపిస్తోంది. బండ్లు ఓడల్లా.. ఓడలు బండ్లు అవుతాయి అన్నట్టుగా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అసలు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతుందని.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎవ్వరూ అనుకోలేదు. కానీ.. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతే కాదు.. తన కొత్త మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. అయితే.. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో చూసుకుంటే అందులో ఎక్కువ మంది ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితులే. ఆయన తండ్రి వైఎస్సార్ కు సన్నిహితులు కూడా చాలా మంది ఉన్నారు.

నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది సీనియర్ నేతలు.. వైఎస్సార్, జగన్ కు దగ్గరి వాళ్లే. తెలంగాణ కావచ్చు.. ఏపీ కావచ్చు.. కాంగ్రెస్ నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వైఎస్ కుటుంబానికి సన్నిహితులుగా ఉంటారు. తాజాగా తెలంగాణ మంత్రివర్గంలో ఉన్న మంత్రులను చూస్తే అందరూ వైఎస్ జగన్ కు, ఆయన కుటుంబానికి సన్నిహితులే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు హోంశాఖ, మున్సిపల్, విద్య శాఖలను ఇచ్చారు. మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక, విద్యుత్ శాఖ ఇచ్చారు. అలాగే.. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉంటారు. దామోదర రాజనర్సింహకు వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సివిల్ సప్లయి, నీటి పారుదల శాఖ ఇచ్చారు. సీతక్కకు పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ ఇచ్చారు. శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ ఇచ్చారు. కొండా సురేఖకు అటవీ శాఖ ఇచ్చారు. పొంగులేటికి సమాచార, రెవెన్యూ శాఖ, కోమటిరెడ్డికి సినిమాటోగ్రఫీ, ఆర్ అండ్ బీ, జూపల్లికి పర్యాటక, ఎక్సైజ్ శాఖ, తుమ్మలకు వ్యవసాయ శాఖ, పొన్నం ప్రభాకర్ కు రవాణా, బీసీ సంక్షేమ శాఖను ఇచ్చారు.

Revanth Reddy – YS Jagan : జగన్ కు ఆ ఇద్దరు మంత్రులు ఆప్తులు

ఇందులో ఉన్న వాళ్లలో చాలామంది జగన్ కు సన్నిహితులే. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితులు. మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ.. వీళ్లంతా రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులు. పొంగులేటి, కొండా సురేఖ ఈ ఇద్దరూ అయితే ఇప్పుడు జగన్ కు చాలా సన్నిహితులు. అంటే.. మొత్తం మీద తెలంగాణ కేబినేట్ లో ఉన్న వాళ్లను చూసుకుంటే ఎక్కువ మంది వైఎస్సార్ కుటుంబానికి, జగన్ కు అత్యంత దగ్గరి వాళ్లుగా కనిపిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది