Revanth Reddy – YS Jagan : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగియడం, ఫలితాలు రావడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అన్నీ క్షణాల్లో జరిగినట్టుగా అనిపిస్తోంది. బండ్లు ఓడల్లా.. ఓడలు బండ్లు అవుతాయి అన్నట్టుగా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అసలు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతుందని.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎవ్వరూ అనుకోలేదు. కానీ.. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతే కాదు.. తన కొత్త మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. అయితే.. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో చూసుకుంటే అందులో ఎక్కువ మంది ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితులే. ఆయన తండ్రి వైఎస్సార్ కు సన్నిహితులు కూడా చాలా మంది ఉన్నారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది సీనియర్ నేతలు.. వైఎస్సార్, జగన్ కు దగ్గరి వాళ్లే. తెలంగాణ కావచ్చు.. ఏపీ కావచ్చు.. కాంగ్రెస్ నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వైఎస్ కుటుంబానికి సన్నిహితులుగా ఉంటారు. తాజాగా తెలంగాణ మంత్రివర్గంలో ఉన్న మంత్రులను చూస్తే అందరూ వైఎస్ జగన్ కు, ఆయన కుటుంబానికి సన్నిహితులే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు హోంశాఖ, మున్సిపల్, విద్య శాఖలను ఇచ్చారు. మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక, విద్యుత్ శాఖ ఇచ్చారు. అలాగే.. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉంటారు. దామోదర రాజనర్సింహకు వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సివిల్ సప్లయి, నీటి పారుదల శాఖ ఇచ్చారు. సీతక్కకు పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ ఇచ్చారు. శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ ఇచ్చారు. కొండా సురేఖకు అటవీ శాఖ ఇచ్చారు. పొంగులేటికి సమాచార, రెవెన్యూ శాఖ, కోమటిరెడ్డికి సినిమాటోగ్రఫీ, ఆర్ అండ్ బీ, జూపల్లికి పర్యాటక, ఎక్సైజ్ శాఖ, తుమ్మలకు వ్యవసాయ శాఖ, పొన్నం ప్రభాకర్ కు రవాణా, బీసీ సంక్షేమ శాఖను ఇచ్చారు.
ఇందులో ఉన్న వాళ్లలో చాలామంది జగన్ కు సన్నిహితులే. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితులు. మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ.. వీళ్లంతా రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులు. పొంగులేటి, కొండా సురేఖ ఈ ఇద్దరూ అయితే ఇప్పుడు జగన్ కు చాలా సన్నిహితులు. అంటే.. మొత్తం మీద తెలంగాణ కేబినేట్ లో ఉన్న వాళ్లను చూసుకుంటే ఎక్కువ మంది వైఎస్సార్ కుటుంబానికి, జగన్ కు అత్యంత దగ్గరి వాళ్లుగా కనిపిస్తున్నారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.