
#image_title
Roja : ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ సభ్యులు అయితే సభలో రచ్చ రచ్చ చేస్తున్నారు. దానికి కారణం.. చంద్రబాబు అరెస్ట్. ఆయన్ను అరెస్ట్ చేయడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కావాలని వైసీపీ ప్రభుత్వమే చంద్రబాబును అరెస్ట్ చేయించిందని అసెంబ్లీలో మండిపడ్డారు. బాలకృష్ణ అయితే ఒక అడుగు ముందుకు వేసి అసెంబ్లీలోనే మీసాలు తిప్పడం, తొడ కొట్టడం చేశారు. అంతే కాదు విజిల్ కూడా వేశారు. రచ్చ రచ్చ చేశారు. దానిపై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
#image_title
తాజాగా అసెంబ్లీలో రోజా చేసిన వ్యాఖ్యలకు బాలకృష్ణ కోపంగా చూశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసెంబ్లీలో రోజా మాట్లాడుతూ.. ఈ శాసనసభను అవమానించారు. నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీకి నోటీసులు ఇచ్చి వాటిపై ఓటింగ్ పెట్టి సెలక్ట్ కమిటీకి పంపుతున్నామంటే మాకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. శాసనమండలిలో అక్కడ వీళ్లు చేసిన పనులు ఏంటి అధ్యక్షా. చంద్రబాబు చేసిన కుట్ర దారుణమైనది కాదా? అధికారం కోల్పోయినా కూడా అహంకారంతో చంద్రబాబు వ్యవహరించారు. నారా లోకేష్ ఒక ఎమ్మెల్సీగా కూడా అర్హుడు కాదు. ఆయన ప్రజలతో ఎన్నుకోబడలేదు కాబట్టే ఆయనకు శాసనసభ, శాసనమండలి విలువ తెలియదు అంటూ రోజా నారా లోకేష్ పై సీరియస్ అయ్యారు.
చంద్రబాబు ఏమన్నా పతీతనా.. ఆయన ఎలాంటి అక్రమాలు చేశారో సాక్ష్యాధారాలతో సహా నిరూపితం అయింది. చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో కూర్చున్నారు. ఇక ఆ ఇంటికే చెందిన దద్దమ్మ, దద్దోజనం.. ఆయనకు ఏం మాట్లాడుతాడో ఎవ్వరికీ తెలియదు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వ్యవస్థలను బ్రష్టుపట్టించడంలో చంద్రబాబుది ఎంత పాత్ర ఉందో.. యెనమలది కూడా అంతే ఉంది. చంద్రబాబు పతీత కాదు.. ఆయన కొడుకు అంతకంటే కాదు. వీళ్ల తోక జాడింపులకు, వీళ్ల తాటాకు చప్పుళ్లకు ఇక్కడ భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు అంటూ రోజా శాసనసభలో మండిపడ్డారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.