#image_title
Balakrishna : ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ మీదనే చర్చ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ. అసలు చంద్రబాబు ఏం చేశాడని అరెస్ట్ చేశారు. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా అని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఈనేపథ్యంలో వైసీపీ నేతలు అయితే పండుగ చేసుకుంటున్నారు. మామూలు పండుగ కాదు.. చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందంటూ డ్యాన్సులు చేస్తున్నారు. ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చంద్రబాబును, టీడీపీ నేతలను, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా వదలడం లేదు వైసీపీ నేతలు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై బాలకృష్ణ ప్రెస్ మీట్ పెట్టారు. ఈసందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చంద్రబాబు అరెస్ట్ అయినా కూడా ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. కనీసం ఆయన అరెస్ట్ ను కూడా ఖండించలేదు జూనియర్ ఎన్టీఆర్. దీనిపై సర్వత్రా చర్చనీయాంశం కావడంతో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ స్పందించారు.
మేమే త్వరలో చంద్రబాబును కలుద్దామనుకొని నిర్ణయించుకున్నాం. ఆయన రిమాండ్ కూడా పొడిగించారు. ఎందుకు పొడిగించారో కూడా అర్థం కావడం లేదు. మళ్లీ 14 వరకు అంటున్నారు. ఆ తర్వాత దసరా సెలవులే వస్తాయి. అక్కడ సైకో పరిపాలన, మతిస్థిమితం లేని నాయకుడు.. కేవలం ప్రజా సంక్షేమాన్ని గాలిలో వదిలేసి.. ప్రతిపక్ష నాయకులను జైలులో వేయడమే జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇక్కడ చూస్తేనేమో అంతా మసిపూసిన మారేడు కాయలాగా జరుగుతోంది వ్యవహారం. పొత్తు విషయంలో ఇక్కడున్న విషయాలు ఆయనకు చెప్పి ఆ తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం. మేము అన్ని సీట్లలో పోటీ చేయాలా? లేక కొన్ని సీట్లు వాళ్లు ఇవ్వాలా అనేదానిపై నిర్ణయం తీసుకుంటాం. పార్టీకి, రాష్ట్రానికి పునర్‌వైభవం తీసుకొస్తాం అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
#image_title
ఇది అసలు కేసే కాదు. కావాలని ప్రభుత్వం చేస్తున్న రచ్చ ఇది. ఐటీ వాళ్ల ర్యాలీని అడ్డుకోవడం, వాళ్లు అప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తారు అనడం అభూత కల్పన. తెలంగాణలోనూ పార్టీ ఉంది. దానికి ఒక సమయం, సందర్భం, అవకాశం రావాలి. తెలంగాణలోనూ టీడీపీ పోటీ చేస్తుంది. దగ్గుబాటి పురందేశ్వరి కూడా నాతో మాట్లాడారు. బీజేపీ వాళ్లు కూడా చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్నారు. మాకు ఒక అవగాహన రావాలి. అవగాహన రాకుండా ఒకరిపై నింద వేయడం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ లో ఉన్నవాళ్లంతా టీడీపీలో ట్రెయినింగ్ పొందిన వాళ్లే కాదు. ముఖ్యమంత్రితో సహా.. అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగం వాళ్లు ఎవ్వరూ స్పందించలేదు.. జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించలేదు కదా అంటే వాడిని అసలు ఈ సెక్షన్ నుంచే తీసేశాం. ఐ డోంట్ కేర్.. తెలంగాణలో టీడీపీ ఉందని చూపిస్తాం అంటూ బాలకృష్ణ ఫైర్ అయ్యారు.
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
Coriander | వంటకాలకు రుచి, సువాసనను అందించే కొత్తిమీర (Coriander) ప్రతి వంటగదిలో తప్పనిసరి పదార్థం. తాజా ఆకులు, ఎండిన గింజలు,…
Devi Navaratri 2025 | నవరాత్రి పండుగను దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల ఉపవాసంలో భక్తులు…
This website uses cookies.