Balakrishna : నిన్న తొడ కొట్టాడు.. ఇవాళ విజిల్ వేశాడు.. ఏంది బాలయ్య ఇది.. అసెంబ్లీ అనుకున్నావా లేక థియేటర్ అనుకున్నావా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Balakrishna : నిన్న తొడ కొట్టాడు.. ఇవాళ విజిల్ వేశాడు.. ఏంది బాలయ్య ఇది.. అసెంబ్లీ అనుకున్నావా లేక థియేటర్ అనుకున్నావా?

Balakrishna : నందమూరి బాలకృష్ణ.. సినిమా నటుడు అనేది పక్కన పడితే రాజకీయాల్లో ఆయన ఎమ్మెల్యే. టీడీపీ నేత. టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు. అందుకే ప్రస్తుతం టీడీపీలో ముఖ్యనేతగా కొనసాగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ బాలకృష్ణ అప్పుడప్పుడు కొంటెపనులు చూస్తూ అడ్డంగా దొరికిపోతుంటారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాలకృష్ణ రోజూ చేస్తున్న వింత పనులు చూసి ఇతర ఎమ్మెల్యేలే కాదు.. ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :22 September 2023,12:00 pm

Balakrishna : నందమూరి బాలకృష్ణ.. సినిమా నటుడు అనేది పక్కన పడితే రాజకీయాల్లో ఆయన ఎమ్మెల్యే. టీడీపీ నేత. టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు. అందుకే ప్రస్తుతం టీడీపీలో ముఖ్యనేతగా కొనసాగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ బాలకృష్ణ అప్పుడప్పుడు కొంటెపనులు చూస్తూ అడ్డంగా దొరికిపోతుంటారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాలకృష్ణ రోజూ చేస్తున్న వింత పనులు చూసి ఇతర ఎమ్మెల్యేలే కాదు.. ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు.

balakrishna whistle in ap assembly video viral

#image_title

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ తొడగొట్టిన విషయం తెలిసిందే. చూసుకుందాం అంటే చూసుకుందాం అంటూ బాలకృష్ణ సినిమా రేంజ్ లో డైలాగ్స్ చెప్పి తొడగొట్టారు. ఇక.. ఈరోజు ఏకంగా విజిల్ తీసుకొచ్చి విజిల్ వేస్తూ అసెంబ్లీలో హంగామా సృష్టించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్ లను నిన్న ఏపీ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Balakrishna : టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా విజిల్ వేసిన బాలకృష్ణ

అయితే.. టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా బాలకృష్ణ విజిల్ వేశారు. అసెంబ్లీలో హడావుడి సృష్టించారు. ఆయన విజిల్ వేస్తుంటే మార్షల్స్ వచ్చి ఆయన్ను అడ్డుకున్నారు. అయినా కూడా బాలకృష్ణ విజిల్ వేయడం మాత్రం ఆపలేదు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లకు ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు.

 

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది