Potti Sriramulu : పొట్టి శ్రీరాములు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రుల గాంధీ అని కూడా ఆయనను పిలవచ్చు. పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 25 ఏళ్ల వయసులోనే శ్రీరాములుకు అన్నింటిపై విరక్తి వచ్చింది. అందుకే ఆయన 25 ఏళ్లకే అన్నింటినీ వదిలేసి స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీతో కలిసి నడిచారు. నిస్వార్థతకు ఆయన మారు పేరు. శ్రీరాములు గురువు మహాత్మా గాంధీ. సబర్మతి ఆశ్రమంలో ఉంటూ గాంధీ అడుగు జాడల్లో నడిచేవారు శ్రీరాములు.
గాంధీజీకి కూడా శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. శ్రీరాములు లాంటి కార్యదీక్షా పరులు చాలా తక్కువగా ఉంటారని గాంధీజీ అప్పట్లో చెబుతుండేవారు. అప్పట్లో హరిజనులను ఆలయాల్లోకి రానిచ్చేవారు కాదు. దానిపై శ్రీరాములు ఎప్పుడూ పోరాడుతూ ఉండేవారు. హరిజన దేవాలయ ప్రవేశమే అస్పృశ్యతానివారణ అని.. ఏకపంక్తి భోజనముతోనే కులతత్వాలను పోగొట్టుకోవచ్చని పొట్టి శ్రీరాములు చెబుతూ ఉంటారు. అందుకే హరిజనులను కూడా దేవాలయాల్లోకి రానిచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు పొట్టి శ్రీరాములు. అయినా కూడా ఎక్కడో ఒక చోట హరిజనులను చిన్నచూపూ చూస్తూనే ఉండేవారు.
మద్రాస్ ప్రావిన్స్ లో ఉన్న అన్ని దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించాలని 1946, నవంబర్ 25న పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే.. కొద్ది రోజుల్లోనే స్వాతంత్రం రావచ్చని అందరూ ఆశాభావంతో ఉండి అందరూ స్వాతంత్ర్య ఉద్యమం మీదనే ఉండేది. దీంతో కాంగ్రెస్ నాయకులు అందరూ పొట్టి శ్రీరాములును ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని కోరారు. కానీ.. శ్రీరాములు వాళ్ల మాట వినలేదు. దీంతో అందరూ గాంధీజీని వెళ్లి శ్రీరాములు దీక్ష గురించి చెప్పారు.
దీంతో శ్రీరాములు దీక్షను విరమింపజేస్తాడు గాంధీ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శ్రీరాములు నెల్లూరు జిల్లాకు మారి అక్కడే ఉన్నారు. స్వాతంత్ర్యం తర్వాత హరిజనోద్దరణకు కృషి చేశారు. రోడ్ల మీద నడుస్తూ కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, ఎండకు గొడుగు కూడా లేకుండా హరిజనుల కోసం ఎంతో కృషి చేశారు పొట్టి శ్రీరాములు. ఒకానొక సమయంలో శ్రీరాములును చూసి అందరూ పిచ్చివాడు అని నవ్వుకునే వారు. కానీ.. ఆ పిచ్చివాడే ఆంధ్రుల ఆత్మగౌరవం అయిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు.
అప్పట్లో ఆంధ్రా.. మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఉండేది. టంగుటూరి ప్రకాశం పంతులు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కొన్నేళ్ల తర్వాత ఆయ పదవీచ్యితుడు అయ్యారు. స్వాతంత్య్రం వచ్చినా కూడా తెలుగు వారికి గుర్తింపు ఉండేది కాదు. తమిళులదే అక్కడ రాజ్యం. రాజాజి ప్రభుత్వం కూడా తెలుగు వారిని అణచివేసేది.ఎలాగైనా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం రావాల్సిందే అని నిర్ణయించుకున్న పొట్టి శ్రీరాములు నేరుగా మద్రాసుకు వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కానీ.. అప్పట్లో శ్రీరాములుకి కనీసం తెలుగు వాళ్లు కూడా మద్దతు ఇవ్వలేకపోయారు.
టంగుటూరు ప్రకాశం పంతులు మాత్రం ఆయనకు మద్దతు ఇచ్చారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినా కనీసం తెలుగు వాళ్లు కూడా ఆయన్ను పట్టించుకోలేదు. 58 రోజుల తర్వాత ఆయన చిక్కశీల్యం అయ్యారు. ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగు వాళ్లు రాలేదు. కానీ.. పొట్టి శ్రీరాములు వెంట సాదు సుబ్రహ్మణ్య శాస్త్రి మాత్రం ఉన్నారు. ఆయనకు మద్దతు ఇచ్చారు. కానీ.. 58 రోజుల పాటు ఏం తినకుండా, తాగకుండా పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో కన్నుమూశారు. చివరకు ఆయనకు దహన సంస్కారాలు చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో.. సాదు సుబ్రహ్మణ్య శాస్త్రి గుడివాడ వాళ్లను సాయం అడుగుదామని ఘంటసాలకు ఈ విషయం చెప్పడంతో.. ఘంటసాలతో పాటు పలువురు వచ్చి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
కానీ.. ఎవరికోసం అయితే అశువులు బాసాడో వాళ్లే పట్టించుకోలేదు అని ఒక ఎడ్ల బండి మీద శ్రీరాములు శవాన్ని వేసుకొని ఘంటసాల తెలుగు వారిని తిడుతూ పాటలు పాడటంతో అప్పుడు కొందరు తెలుగు వాళ్లు ఆ శవయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికైనా తెలుగు వాళ్లు రండి అంటూ పాటలు పాడటంతో తెలుగు వారిలో అప్పుడు కానీ ఉక్రోశం రాలేదు. మద్రాస్ ప్రావిన్స్ మొత్తాన్ని ఆంధ్రులు తగులబెట్టడంతో అప్పుడు రాజాజీని శాంతించాలని చెప్పిన అప్పటి ప్రధాని నెహ్రూ శ్రీరాములు మరణం వృధా పోదని పార్లమెంట్ లో ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఇస్తామని ప్రకటించారు. దీంతో తెలుగు వారు శాంతించారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.