Gandeevadhari Arjuna Movie Review : సినిమా పేరే విచిత్రంగా ఉంది కదా. గాండీవధారి అర్జున అనే పేరు అర్థం చాలామందికి తెలియదు కానీ.. ఆ సినిమా చూస్తేనే అసలు ఆ సినిమాకు ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థం అవుతుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఏ సినిమా సెలెక్ట్ చేసుకున్నా దాంట్లో ఎంతో కొంత సోషల్ మెసేజ్ ఉంటుంది. ఇప్పటి వరకు వరుణ్ తేజ్ తీసిన సినిమాలు చూస్తే అదే అనిపిస్తుంది. గాండీవధారి అర్జున సినిమా కూడా అదే తరహాలో రూపొందిన మూవీ. ఇది ఒక యాక్షన్, త్రిల్లర్ అండ్ ఎంటర్ టైనర్ మూవీ. ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. మన చుట్టూ ఇంత జరుగుతున్నా ఈ చిన్న విషయాన్ని మనం ఎందుకు మరిచిపోయాం. మనం ఎందుకు కనిపెట్టలేకపోయాం అని ఈ సినిమా చూశాక అనుకుంటాం. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా సోషల్ ఎక్స్‌పరిమెంట్ అనే చెప్పుకోవాలి.
ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించగా.. బీవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. సాక్షీ వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్. పీఎస్వీ గరుడవేగ, ఘోస్ట్ సినిమాల తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న మరో యాక్షన్ త్రిల్లర్ ఇది. ఇక.. ఏజెంట్ మూవీలో హీరోయిన్ గా నటించిన సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్స్ అదిరిపోయాయి. సినిమా టీజర్, ట్రైలర్ చూస్తేనే యాక్షన్ సీక్వెన్స్ లతో నిండి ఉండటంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ కూడా మొత్తం విదేశాల్లో జరగడం గమనార్హం. ఎక్కువగా లండన్ లో జరిగింది. వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ మూవీ. ఈ సినిమా బడ్జెట్ రూ.70 కోట్లు.
నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షి వైద్య
దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
నిర్మాత : బీవీఎన్ఎస్ ప్రసాద్
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జే మేయర్
సినిమా నిడివి : 2 గంటల 16 నిమిషాలు
విడుదల తేదీ : 25 ఆగస్టు 2023
ఈ సినిమాలో వరుణ్ తేజ్.. అర్జున్ వర్మ అనే పాత్రలో నటించారు. ఈ సినిమా ఒక మెడికల్ మాఫియాకు సంబంధించింది. మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ట్రీట్ మెంట్ పేరుతో మాఫియాకు ఎలా తెర లేపారు. లక్ష కోట్ల వ్యాపారంగా ఎలా మారింది. మన చుట్టు ఆసుపత్రుల్లో ఇంత పెద్ద మాఫియా జరుగుతున్నా మనం తెలుసుకోలేకపోయాం అనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమా వస్తోంది. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ మంత్రి అయిన ఆచార్య(నాజర్) ను కొంతమంది చంపాలని ప్రయత్నిస్తుంటారు. వాళ్లు చేసే మెడికల్ స్కాం వల్ల మనుషులకే కాదు.. పర్యావరణం కూడా దెబ్బ తింటుందని ఆయన తెలుసుకుంటారు. దీంతో వాళ్లను ఆపడం కోసం రా ఏజెంట్ అర్జున్ ను ఈ పని చేయాలని అప్పగిస్తాడు.ఈ మెడికల్ మాఫియాను విదేశాల్లో ఉంటూ నడిపిస్తున్న వాళ్లను వరుణ్ తేజ్.. ఎలా ఆటకట్టించాడు. అసలు ఆ మెడికల్ మాఫియాకు, పర్యావరణానికి ఏంటి సంబంధం అనేదే ఈ సినిమా కథ.
ఇది ఒక స్పై అండ్ యాక్షన్ మూవీ అని చెప్పుకోవాలి. సినిమా స్టార్టింగే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో సినిమా అంతా ఆసక్తిగా సాగుతుంది. సినిమాల్లో ట్విస్టులు చాలా ఉంటాయి. ఆ ట్విస్టులతోనే సినిమా ఆసక్తికరంగా మారుతుంది. సినిమా మొత్తాన్ని వరుణ్ తేజ్ తన భుజాల మీద మోశాడు అనే చెప్పుకోవాలి. అర్జున్ పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాలో నటించిన అందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
ప్లస్ పాయింట్స్
యాక్షన్
ట్విస్టులు
స్టోరీ
వరుణ్ తేజ్ నటన
మైనస్ పాయింట్స్
నో ఎమోషన్స్
నో ఎంగేజ్
దితెలుగున్యూస్ రేటింగ్ : 2.75/5
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.