Brother Anil Kumar : వైఎస్ షర్మిల కంటే ముందే ఏపీ రాజకీయాల్లోకి బ్రదర్ అనిల్ కుమార్ ఎంట్రీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brother Anil Kumar : వైఎస్ షర్మిల కంటే ముందే ఏపీ రాజకీయాల్లోకి బ్రదర్ అనిల్ కుమార్ ఎంట్రీ..!

 Authored By kranthi | The Telugu News | Updated on :28 December 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  షర్మిల కోసం ఏపీలో రంగంలోకి దిగిన బ్రదర్ అనిల్

  •  ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కానుందా?

  •  నారా లోకేష్ కు షర్మిల క్రిస్ మస్ గిఫ్ట్ ఎందుకు పంపినట్టు?

Brother Anil Kumar : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఇంకా మూడు నెలలే ఉన్నాయి ఎన్నికల కోసం. దీంతో ఏపీలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ కూటమి మధ్యే పోటీ ఉండబోతోంది. ఈనేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఈ మధ్య యూటర్న్ తీసుకుంటున్నాయి. ఇప్పటికే జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టారు. దీంతో పోటీ ఇంకాస్త టఫ్ కాబోతోంది. అలాగే.. ఇప్పటి వరకు తెలంగాణలో రాజకీయాలు చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీలోనూ రాజకీయాలు చేయబోతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో రాజకీయాలు చేసి అక్కడ కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ తదుపరి టార్గెట్ ఏపీ. అక్కడ అధికారంలో ఉన్నది కూడా వైఎస్ షర్మిల అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అందుకే అక్కడ అన్నకు వ్యతిరేకంగా చెల్లెలును దించాలనేది కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్. దాని కోసం షర్మిలకు చాలా హామీలనే ఇచ్చారట.

నిజానికి ఏపీలో చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్టుగా రాజకీయాలు ఇంతకాలం సాగాయి. కానీ.. ఇక నుంచి అన్న వర్సెస్ చెల్లెలుగా మారబోతున్నాయి. అమరావతి ప్రాంతంలో వైఎస్ షర్మిల ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారట. ఆ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సోనియా గాంధీ హాజరు కానున్నారట. ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు ఈ సభను నిర్వహించనున్నారట. అప్పుడే ఏపీ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిలను అధ్యక్షురాలిగా చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఆమె వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దాని వల్ల.. వైసీపీ ఓటు బ్యాంకు అయితే పోయే ప్రమాదం ఉంది. ఆమె వైఎస్సార్ కూతురు కావడంతో వైఎస్సార్ అభిమానులు కొందరు ఖచ్చితంగా తన వైపు మళ్లే అవకాశం ఉంది. ఆయన కూతురుగా ఖచ్చితంగా జనాలు ఆమెను ఆదరిస్తారు. జగన్ కోసం కూడా ఆమె అప్పట్లో ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ఆమెకు అదే ఆదరణ లభించే అవకాశం ఉంది.

Brother Anil Kumar : బ్రదర్ అనిల్ రాజకీయాలు షురూ

ఇప్పటికే బ్రదర్ అనిల్ ఏపీ రాజకీయాల్లోకి దిగినట్టు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, వైఎస్ షర్మిలకు మద్దతు వచ్చేలా ముందే వ్యూహాలు రచించారట. పలు సంఘాలతో బ్రదర్ అనిల్ ముందే మాట్లాడారట. అవన్నీ ముందే మాట్లాడి పెట్టారట. పక్కా ప్లాన్ గా ముందుకు వెళ్తున్నారట. ఆయనతో పాటు కేవీపీ కూడా వైఎస్ షర్మిల వెనుక నిలబడనున్నారట. వైసీపీలో ఉన్న రెబల్ అభ్యర్థులకు కాంగ్రెస్ లో టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నారట. వైఎస్సార్ చేసిన పనులను చెప్పి మళ్లీ కాంగ్రెస్ కు ఏపీలో పునరుజ్జీవం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది