
Chandra Babu : సీఎం పదవి పవన్ కళ్యాణ్ కి ఇస్తా కానీ ఒక కండిషన్.. చంద్రబాబు నాయుడు..!!
Chandra Babu : ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక వై.యస్.జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష నేతలు కూటమిగా ఏర్పడి వార్ ని ప్రకటించాయి. జనసేన టీడీపీ తో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీ కూడా వాళ్లతో పొత్తు పెట్టుకుంటే జగన్ కి ఓటమి ఖాయమని అంటున్నారు. ఇక తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ .. ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వలన మీ జీవితాల్లో వెలుగు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వలన వ్యవస్థలను సర్వనాశనం చేస్తే ప్రజల జీవితాలు నాశనం అవుతాయి. అదే ఈ ఐదు సంవత్సరాలలో జరిగింది. రాష్ట్రంలో ప్రజల కోసం యజ్ఞాలు చేశాను. మానవ ప్రయత్నం చేస్తాం. పోరాడుతాం. దేవుడు కూడా సహకరించాలి. అందుకే ఈ యజ్ఞాలు కూడా చేశానని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం వలన 45 ఏళ్లుగా పార్టీని నిలబెడుతూ వస్తున్నానని, నాకు ఇంకేం పదవులు అవసరం లేదని, నా రికార్డు ఇంకా ఎవరు బ్రేక్ చేయలేదు అని ఆయన అన్నారు.
సమైక్యాంధ్రలో 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా, సమైకాంధ్రలో 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, 25 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా, దేశానికి ప్రపంచానికి గౌరవాన్ని తెచ్చాను. ఎక్కడా కూడా తెలుగుదేశానికి అపఖ్యాతి తీసుకురాలేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మార్చుకునే తలరాత మన చేతుల్లోనే ఉంది. ఒక ప్రభుత్వ విధానం వలన సంపద సృష్టించబడాలి. ఇటీవల వచ్చిన తుఫాను వలన పంటలను నాశనం అయ్యాయి. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదు. కాలువలను తవ్వించలేదు. మురికి గుంటలలో మట్టిని తీయలేదు. దీంతో కాలువలు పంటలు కలిసిపోయి తుఫాను వలన పంటలు నాశనం అయ్యాయి. ఇది ప్రభుత్వ వైఫల్యం అని మండిపడ్డారు.
తెలుగుదేశం అధికారంలో ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. వైయస్సార్సీపి ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఫ్యాక్టరీలన్నీ పోయాయి. ఒక వ్యక్తి ముచ్చట పడి ప్యాలెస్ను కట్టుకుంటే దానిని బలవంతంగా లాక్కున్నారు. ఇవ్వకపోతే దౌర్జన్యంగా 22ఏ కేసు పెట్టి బెదిరించారు. నాలుగు వేల కోట్ల ఆస్తిని కబ్జా చేసుకుని సెటిల్మెంట్ చేసుకున్నారు. గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి అమాయకుల ఆస్తులను కబ్జా చేసుకుంటున్నారు. ఇలా సైకో జగన్ ప్రజలను ఇబ్బంది పెడుతూ, పాలన సాగిస్తున్నాడని అలాంటి వారిని అధికారంలోకి రానివ్వకూడదని చంద్రబాబు నాయుడు హితవు పలికారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.