Salaar Movie Collections : ప్రభాస్ ఎట్టకేలకు సలార్ సినిమా తో హిట్టు కొట్టాడు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా డిసెంబర్ 22న ఐదు భాషలలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే 178.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 2023లో హైయెస్ట్ ఓపెనింగ్ డే గ్రాసర్గా ఈ సినిమా ఉంది. లియో సినిమా రికార్డు బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలిచింది. రెండో రోజుకు సలార్ వసూళ్లు తగ్గాయి. అయితే మూడో రోజుకు పుంజుకుంది. ఆదివారం నుంచి వసూళ్లు బాగా వస్తున్నాయి. సలార్ మూవీ వరల్డ్ వైడ్ మూడు రోజులకు 402 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సలార్ భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకా చాలా దూరంలో ఉంది. ఈరోజు క్రిస్మస్ సెలవు దినం కాగా సలార్ సినిమాకి కలిసొచ్చే అంశం. న్యూ ఇయర్ వరకు జనాలు పండగ మూడ్ లో ఉంటారు.
ఈ సమయంలో సలార్ వసూళ్లు నిలకడగా ఉంటే బ్రేక్ ఈవెన్ అంత కష్టం కాదు. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో సలార్ వసూలు సాలిడ్ గా ఉన్నాయి. ఇక సలార్ ఫైనల్ ఫిగర్స్ ఎలా ఉంటాయో చూడాలి. ప్రభాస్ కటౌట్ కి తగ్గ సినిమా కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు. ఈ సినిమాకి ప్రశాంత నీల్ దర్శకత్వం వహించారు. కేజిఎఫ్ డైరక్టర్ తో ప్రభాస్ చేసిన మూవీ కావడంతో మరింత హైప్ పెరిగింది. అభిమానుల నమ్మకం నిలబడుతూ సలార్ మూవీలో ప్రభాస్ మాస్ అప్పీయరెన్స్ అందరిని ఆకట్టుకుంది. ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టుగా మాస్ యాక్షన్ సన్నివేశాలను ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రశాంత్ సక్సెస్ అయ్యారు. రెండు భాగాలుగా విడుదల కానున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతిబాబు, బాబీ సింహ, ఈశ్వరి రావు కీలక పాత్రలు చేశారు.
ఇక ప్రభాస్ పాన్ ఇండియా హీరో అవ్వడంతో ఆయన ప్రతి సినిమాపై మరింత హైప్ పెరుగుతుంది. ఇక గత సినిమాలు నిరాశ పరచడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ సలార్ సినిమాతో సాలిడ్ అందుకున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ కి తగ్గ సినిమా పడడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సాలిడ్ హిట్ అందుకుంది. ఇక రెండో భాగం కూడా అదే రేంజ్ లో సక్సెస్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేజిఎఫ్ తరహా లోనే రెండు పార్ట్ లుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దానిలాగే ఇది కూడా హిట్గా నిలుస్తుందని అంటున్నారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.