
Chandrababu : ఓ వైపు లడ్డు వ్యవహారం, మరోవైపు జగన్ డిక్లరేషన్.. చంద్రబాబు నిర్ణయం ఏంటంటే..!
Chandrababu : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా రంజుగా సాగుతుంది. ఒకవైపు జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తుంటే మరోవైపు చంద్రబాబుపై జగన్ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదని, ర్యాలీలు, జనసమీకరణలు చేయవద్దని మాత్రమే చెప్పామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రమని, భక్తులు పవిత్రంగా భావించే క్షేత్రాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆచారాలు పాటించకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, ఇంతకుముందు జగన్ నియమాలు ఉల్లంఘించి తిరుమలకు వెళ్లారని తెలిపారు. చాలామంది డిక్లరేషన్ ఇచ్చి గౌరవంగా దర్శనం చేసుకున్నారన్న చంద్రబాబు, ఇతర మతాలను గౌరవించడం అంటే ఆయా ఆలయాల సంప్రదాయాలను పాటించడమే అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న విచిత్ర పరిణామాల మధ్య చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టగా, వాటి విలువ 3,000 కోట్ల రూపాయలు. అక్టోబర్ 1వ తేదీన ఇవి వేలానికి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ద్వారా వేలం పాట సాగుతుంది..కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తుంది రిజర్వ్ బ్యాంక్. ఈ బాండ్ల కాల వ్యవధి ఒకటి- 14, మరొకటి- 20, ఇంకొకటి-24 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టడం ఇది అయిదోసారి.
Chandrababu : ఓ వైపు లడ్డు వ్యవహారం, మరోవైపు జగన్ డిక్లరేషన్.. చంద్రబాబు నిర్ణయం ఏంటంటే..!
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి నెల రోజుల్లో 2,000 కోట్ల రూపాయల చొప్పున బాండ్లను వేలం పాట ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరో 5,000 కోట్ల రూపాయల సమీకరణకు పూనుకుంది. మూడో విడతలో 2,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ వద్ద రుణాల ద్వారా సేకరించింది. నాలుగో విడతలో మరో 3,000 కోట్ల రూపాయల సమీకరించింది. అప్పటికే ఈ మొత్తం కలిపి 12,000 కోట్ల రూపాయలు రుణభారం రాష్ట్ర ప్రజలపై పడినట్టయింది. వేల కోట్లు.. ఇప్పుడు తాజాగా మరో 3,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంది చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్.. మొత్తంగా ఆయా ప్రభుత్వాల నుంచి 19,942 కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వేలం వేయనుండడం విశేషం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.