వైఎస్ జగన్ పక్కకు తప్పుకో.. 1995 నాటి సంఘటనలు గుర్తు వస్తున్నాయి..!
Chandrababu Naidu : 2019 లో జగన్ అధికారంలోకి వస్తాడని, టీడీపీ పార్టీ ఘోరమైన ఓటమి చెందుతుందని పాపం టీడీపీ నేతలు ఎవరు ఊహించలేకపోయారు. దీనితో ఎన్నికల ఫలితాల తర్వాత పిచ్చెక్కిపోయినంత పని అయ్యింది. తాజాగా ఆ పార్టీ నేతల డిమాండ్ చూస్తే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అర్ధం అవుతుంది. రాష్ట్రంలో కరోనా కట్టడి చేయటం వైఎస్ జగన్ వలన కావటం లేదు. చేతకాని తనంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. అంత చేతకాకపోతే నువ్వు పక్కకు తప్పుకొని చంద్రబాబు నాయుడు కుర్చీ ఇవ్వు పాలన అంటే ఏమిటో చూపిస్తాడు.. కరోనా ను ఎలా దారికి తెస్తాడో చుడండి అంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నారు.
152 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని రాజమార్గంలో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ ను పీఠం నుండి దిగిపొమ్మని టీడీపీ నేతలు అడుగుతుంటే 1995 నాటి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో పెద్దాయన ఎన్టీఆర్ ముందు నిలబడి పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత దొడ్డి దారిలో కుట్రలు చేసి చంద్రబాబు సీఎం కుర్చీలో కుర్చున్నాడనే మాటలు ఇప్పటికి వినిపిస్తాయి. వైఎస్ జగన్ తప్పుకొని కుర్చీ చంద్రబాబుకు ఇస్తే.. ! అంటూ మాట్లాడుతున్న టీడీపీ భజన బ్యాచ్ ని చూస్తుంటే “మా నేతకు సొంతగా ఎన్నికల్లో గెలిచి సీఎం అవ్వటం చేతకాదు. ఇలా దొంగ దారిలో సీఎం అవ్వటమే తెలుసని స్వయంగా ఒప్పుకుంటున్నట్లు అనిపిస్తుంది..
అయిన వైఎస్ జగన్ తప్పుకొని Chandrababu Naidu బాబుకు అధికారం ఇస్తే ఏమి చేస్తాడు. తనతో పాటు మరో ఇద్దరు నేతలకు కరోనా కిట్ తోడికించి హాస్పెటల్స్ లో విజిటింగ్ కు వెళ్లి, రోగులతో మాట్లాడుతున్నట్లు బిల్డుప్, అదే సమయంలో పక్కనే ఉన్న డాక్టర్స్ కు వార్నింగ్ లు ఇవ్వటం. పనిలో పనిగా వాక్సిన్ ను తానే తయారుచేస్తున్నట్లు పోజులు ఇవ్వటం. అర్ధరాత్రి ఒంటిగంట దాక ఒక్కటే కంట్రోల్ రూమ్ లో కూర్చొని అందరిని పరుగులు పెట్టిస్తున్నట్లు, ( బ్యాక్ గ్రౌండ్ లో గడియారం ఖచ్చితంగా ఉంటుంది) హడావిడి చేసి తెల్లారేసరికి ఎల్లో మీడియాలో “కరోనా పై యుద్ధం”.. “విజయం దిశగా బాబు అడుగులు..” లాంటి పైకెత్తే స్లొగన్స్
అంతటితో ఆగకుండా ఢిల్లీ సీఎం, పశ్చిమ బెంగాల్ సీఎం ఫోన్ చేసి తమ రాష్ట్రంలో కూడా కరోనా నివారణకు చిట్కాలు చెప్పాలని బాబును అడిగినట్లు, పీఎం మోడీ స్వయంగా ఫోన్ చేసి “శబాష్ నాయుడు” అంటూ మెచ్చుకున్నట్లు… అబ్బో ఆ పబ్లిసిటీ మాములుగా ఉండదు. పైగా తమ అనుకూల పేపర్స్ లో పేజీలకు పేజీలు ఫుల్ పేజీ యాడ్స్ నింపేయటం లాంటి డ్రామాలు చేయటానికి తప్ప మరోదానికి సూట్ కాదు చంద్రబాబు.. ఇప్పుడు జగన్ తప్పుకొని బాబుకు అధికారం ఇస్తే ఇంతకంటే దారుణమైనవి చూడటం తప్ప అయన వలన ఒరిగే లాభం ఏమి లేదు..