Chandrababu : గుత్తి సభలో సీఎం జగన్ పై చంద్రబాబు పవర్ ఫుల్ డైలాగ్స్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: September 8, 2023, 9:00 pm

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో ప్రారంభించిన ఈ కార్యక్రమంకి భారీ ఎత్తున టిడిపి కార్యకర్తలు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలలో సీఎం జగన్ పై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. నిన్న గుత్తిలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.

నిరంతరం రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తాను చేస్తున్న ఆలోచనలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గడి తప్పిన పాలన మళ్లీ ఎలా సరిదిద్దాలి అనే తపనతో తాను ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజల జీవితాలలో వెలుగులు నింపడం కోసమే తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో కరెంటు కష్టాలపై ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబు సభలో కూడా కరెంటు లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే సైకో అని సైకో ప్రభుత్వం అని విమర్శించారు.

chandrababu powerful dialogues in gutti sabha

chandrababu powerful dialogues in gutti sabha

మమ్మల్ని ఇబ్బందులు పాలు చేసి.. ఆనందం పొందాలనుకుంటే ప్రజలతో మీరు పెట్టుకుంటున్నట్లే అంటూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. మేము కూడా రాటు తేలిపోయం. ఎవరికి కూడా భయం లేదు. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరికి తోలు తీసి కారం జల్లి.. కూర్చోబెడతామంటూ చంద్రబాబు వార్నింగ్ ఇస్తూ గుత్తి సభలో.. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp