Chiranjeevi : సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. కొన్ని రోజుల కిందట అల్లు అర్జున్ అరెస్ట్ కాగా, ఆ తర్వాత బెయిల్‌పై బయటకి వచ్చాడు. జనవరి 21 వరకూ ఆయనకు బెయిల్ ఉంటుంది. ఐతే.. తెలంగాణ పోలీసులు ఆయన బెయిల్ రద్దు కోసం ఇవాళ హైకోర్టులో పిటిషన్ వెయ్యబోతున్నారని తెలిసింది. హైకోర్టు బెయిల్ ఇస్తూ.. కొన్ని కండీషన్లు పెట్టింది. కానీ అల్లు అర్జున్ ఆ కండీషన్స్ అమలు చెయ్యకుండా.. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారనీ, మళ్లీ మళ్లీ ప్రెస్‌మీట్లు పెడుతున్నారని పోలీసులు ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ఇలా ప్రెస్‌మీట్ పెట్టిన విషయం పెద్ద దుమారం రేపుతోంది. ఇది బెయిల్ రూల్స్‌కి విరుద్ధమే అంటున్నారు పోలీసులు.
అయితే రోజు రోజుకి అల్లు అర్జున్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారగా, ఆయన ఢిల్లీ నుంచి ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మారేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆసక్తి కరంగా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో సంప్రదింపుల కోసం మెగాస్టార్ ను రంగంలోకి దించేలా కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడుసక్తుంది. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు చిరంజీవి స్పందించింది లేదు. బాధిత కుటుంబానికి సినిమా ముఖ్యులు బాసటగా నిలవకపోవటం పైనా ముఖ్యమంత్రి శాసన సభలో కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో, రేవంత్ ఆగ్రహం గుర్తించిన మెగా, అల్లు ఫ్యామిలీ ఢిల్లీ కేంద్రంగా ముందుగా చర్చలకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు వీడియో విడుదల చేశారు. బయట తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని అల్లు అర్జున్‌కు చెప్పేందుకు ప్రయత్నించామని.. మేనేజర్ తాను చెప్తా అన్నాడని వెల్లడించారు. దయచేసి థియేటర్ నుంచి వెళ్లిపోండి అని అల్లు అర్జున్‌కు డీసీపీ నేరుగా వెళ్లి చెప్పారని వివరించారు. తొక్కిసలాట విషయం అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్లానని, మహిళ చనిపోయింది, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పానని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ వెల్లడించారు. అప్పుడు సినిమా మొత్తం చూశాకే తాను వెళ్తానని అల్లు అర్జున్ అన్నాడని చెప్పారు.
Jr NTR : పుష్ప 2 ప్రీమియర్ షో వల్ల మహిళ మృతికి అల్లు అర్జున్ కూడా కారణమే అని…
Jio : రిలయన్స్ జియో తన కొత్త ₹2,025 న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్‌ను ప్రారంభించింది. జియో మొబిలిటీ వినియోగదారులకు…
Ys Jagan : మాజీ సీఎం జగన్ ఇప్పుడు రూటు మార్చారు. వచ్చే ఎన్నికలలో తమ సత్తా చాటాలని భావిస్తున్న…
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం పేదలకి అనేక శుభవార్తలు చెబుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు…
Producer Naga Vamsi : ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా గరం గరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సంధ్య…
Papaya Leaf Juice : బొప్పాయి పండు గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ పండు మనకు చాలా తేలికగా…
Kichcha Sudeep : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మీడియాకు లెఫ్ రైట్ ఇచ్చాడు. ఆయన నటించిన మ్యాక్స్…
Good News : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒంటరి బాలికల కోసం మెరిట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్…
This website uses cookies.