CM Ramesh : CM రమేష్ వేషాలు, భాగోతాలు బయటపడే టైం వచ్చేసింది..!
CM Ramesh : నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదు.. అనే సినిమా డైలాగ్ విన్నాం కదా. ఇప్పుడు వైజాగ్ పార్లమెంట్ సీటు విషయంలోనూ అదే జరుగుతోంది. కాకపోతే ఆ సినిమా డైలాగ్ కు రివర్స్ గా. ఆ సీటు అందరిదీ అని.. దాని మీద అందరికీ హక్కు ఉంది అన్నట్టుగా కొందరు మాట్లాడుతున్నారు. వైజాగ్ ఎంపీ సీటు అనేది మామూల్ది కాదు. దానికి చాలా చరిత్ర ఉంది. ఆ సీటు చరిత్ర గురించి తెలియని వాళ్లే ఆ సీటు గురించి నానారకాలుగా మాట్లాడుతారు.
అసలు వైజాగ్ సీటు మీద ఎందుకు నాన్ లోకల్స్ కి అంత ప్రేమ. మళ్లీ నాన్ లోకల్సే.. విశాఖ సీటును దక్కించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు కడపకు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కన్ను కూడా ఈ సీటు మీద పడింది. అందుకేనేమో ఆయన ఈ మధ్య ఎక్కువగా వైజాగ్ లో పర్యటిస్తున్నారు. ఇటీవల బీజేపీ హైకమాండ్ నేతల పర్యటన నేపథ్యంలోనూ విశాఖలో సీఎం రమేశ్ కొంచెం హడావుడి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైజాగ్ కు వచ్చినప్పుడు కొంపదీసి వైజాగ్ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని కోరారో లేదో తెలియదు కానీ.. సీఎం రమేశ్ ప్రాణం మొత్తం వైజాగ్ మీదనే ఉంది.
CM Ramesh : రాయలసీమకు చెందిన వారికి వైజాగ్ సీటు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్?
సీఎం రమేశ్.. వైజాగ్ ఎంపీ టికెట్ ఆశించడంలో తప్పు లేదు కానీ.. అసలు రాయలసీమకు చెందిన నేతలకు విశాఖ ఎంపీ టికెట్ ను బీజేపీ హైకమాండ్ ఇస్తుందా? బీజేపీ నేతలు ఈ విషయాన్ని గుర్తిస్తారా? అసలు ఈ సీటు గురించి ఆలోచిస్తారా? ఇప్పటికే బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జీవీఎల్ నరసింహారావు కూడా రెడీగా ఉన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి.. ఈనేపథ్యంలో సీఎం రమేశ్ కు ఆ టికెట్ దక్కే అవకాశం ఎంతవరకు ఉంది. ఎంత కేంద్ర పెద్దలతో తనకు సాన్నిహిత్యం ఉంటే మాత్రం వీళ్లను కాదని నాన్ లోకల్ అయిన సీఎం రమేశ్ కు ఆ టికెట్ దక్కుతుందా? వేచి చూడాల్సిందే.