Teenmaar Mallanna : తెలంగాణలో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇంకా నెల రోజులు కూడా లేవు. వచ్చే నెల ఈ సమయం వరకు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అది అధికార బీఆర్ఎస్ పార్టీనా? లేక వేరే పార్టీనా? అనేది పక్కన పెడితే ఈసారి గెలిచేందుకు ప్రధాన పార్టీలయితే తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? అనేది తెలియాలంటే ఇంకా నెలరోజులు ఆగాలి. ఇక అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే ఎన్నికల్లో గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. హ్యాట్రిక్ సాధించాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ వ్యూహాలను ఎవ్వరూ అందుకోలేకపోతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ వ్యూహాలను అందుకోలేకపోతోంది. వరుస పెట్టి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి కీలక నేతలు వెళ్లడం ఓవైపు, మరోవైపు కాంగ్రెస్ వైపు జనాలు మళ్లడం బీఆర్ఎస్ కు నిద్ర లేకుండా చేస్తోంది…
కేసీఆర్ సర్కార్ పై నిత్యం నిప్పులు చెరిగే తీన్మార్ మల్లన్న కూడా త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ లోకి చాలామంది కీలక నేతలు వచ్చారు. వాళ్లకు టికెట్లు కూడా వచ్చాయి. తీన్మార్ మల్లన్న కూడా అప్పట్లో మేడ్చల్ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. ఆయన కొత్త పార్టీ పెడతారని కూడా వార్తలు వచ్చాయి. కానీ.. కేసీఆర్ ను ఓడించే సత్తా కాంగ్రెస్ కు మాత్రమే ఉందని భావించిన తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే బీజేపీలో చేరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే.. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరితే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? లేక వేరే ఏదైనా పదవి ఇస్తారా అని అంతా అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తీన్మార్ మల్లన్నను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తోంది. ఆయన వస్తే పార్టీకి మరింత బలం వస్తుందని నమ్ముతోంది.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఖచ్చితంగా హామీ ఇస్తే పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. సిరిసిల్ల నుంచి కానీ.. లేదా కామారెడ్డి నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే.. అటు కేసీఆర్ లేదా కేటీఆర్ మీద పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. రెండు నియోజకవర్గాల్లో ఏ టికెట్ ఇచ్చినా వెంటనే కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు తీన్మార్ మల్లన్న. అయితే.. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఈసారి తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎన్నికల్లో ప్రచారం కోసం వాడుకొని పార్టీ గెలిచిన తర్వాత ఏదైనా పదవి ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్. చూడాలి మరి.. తీన్మార్ మల్లన్న అందుకు ఒప్పుకుంటారో లేదో.
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
This website uses cookies.