Salaar VS Devara : ఇది కదా అసలైన ట్విస్ట్ అంటే. మామూలు ట్విస్ట్ కాదిది. ఎందుకంటే రెండు గ్లోబల్ సినిమాలు ఒకేరోజు థియేటర్లలో రిలీజ్ అయితే అసలు బాక్సాఫీసు తట్టుకోగలదా? రెండు పెద్ద సినిమాలు, అది కూడా పెద్ద హీరోల సినిమాలు.. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మామూలుగా ఉండదు సీను. రచ్చ రంబోలానే. అవి కూడా మామూలు సినిమా కాదు బాబోయ్.. ఒకటి సలార్ పార్ట్ 2, రెండోది జూనియర్ ఎన్టీఆర్ దేవర. అసలు సలార్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే.. దేవర సినిమా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ రెండు సినిమాలు ఒకేసారి ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం తట్టుకోవడం కష్టమే. నిజానికి ఈ రెండు సినిమాలను సమ్మర్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
సలార్ పార్ట్ 1 కొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. అంతవరకు బాగానే ఉంది కానీ.. సలార్ పార్ట్ 2 విడుదల విషయంలోనే దేవర సినిమాతో క్లాష్ వస్తోంది. ఎందుకంటే.. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను కూడా 2024 సమ్మర్ కానుకగా తీసుకురావాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. సలార్ పార్ట్ 2 కూడా ఏప్రిల్ 2024 లో రిలీజ్ కాబోతుందట. ఇలా రెండు పెద్ద సినిమాలు ఒకే నెలలో, కొన్ని రోజుల గ్యాప్ లో రిలీజ్ అయిన, ఒకే రోజుల రిలీజ్ అయినా కూడా తట్టుకోవడం మాత్రం కష్టమే. దీన్ని రెండు సినిమాల మేకర్స్ ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు కానీ.. రెండు సినిమాలు మాత్రం ఏప్రిల్ 2024 లోనే వేసవి కానుకగా విడుదల కాబోతున్నాయి.
సలార్ 2 మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకో రెండు మూడు నెలల్లో పూర్తయినా కూడా సినిమాను వేసవి కానుకగానే తీసుకురావాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. పార్ట్ వన్ కి, పార్ట్ 2 కి మధ్య కనీసం 6 నెలల గ్యాప్ ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే.. దేవర షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి కానుంది. షూటింగ్ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసుకొని వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.