Donald Trump : వామ్మో ట్రంప్ మరో షాక్ ఇచ్చాడుగా..!
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వీసా దారులు, గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నవారికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధ్యక్ష పదవిలోకి వచ్చినప్పటి నుంచే వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్, తాజాగా హెచ్1బీ, ఎఫ్1 వీసాలు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు సహాయం చేసే హెల్ప్ డెస్క్‌ను సస్పెండ్ చేశారు. ఇది వలసదారులకు, ముఖ్యంగా భారతీయులకు పెద్ద షాక్‌గా మారింది.
Donald Trump : వామ్మో ట్రంప్ మరో షాక్ ఇచ్చాడుగా..!
ఈ నిర్ణయంతో అమెరికాలో వలస సేవలు అందించే సీఐఎస్ అంబుడ్స్‌మన్ కార్యాలయ సిబ్బందిని 60 రోజులపాటు పరిపాలనా సెలవుపై పంపించారు. వీసా అప్లికేషన్‌లలో జాప్యాలు, సమస్యలు ఎదురైనవారు ఇక్కడి హెల్ప్ డెస్క్‌ను సంప్రదించి పరిష్కారాలు పొందేవారు. ఇప్పుడు ఈ సేవలు నిలిపివేయడం వల్ల సంవత్సరానికి సుమారు 30,000 మంది ప్రజలకు దాదాపు ఆదుకున్న సహాయం అంతరించనుంది. న్యాయ నిపుణులు ఈ చర్యను స్వతంత్ర ఇమ్మిగ్రేషన్ పర్యవేక్షణ సంస్థను రద్దు చేసే తొలి అడుగుగా అభివర్ణిస్తున్నారు. ఇది సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌పై పెద్ద ప్రభావం చూపనుంది.
ఈ పరిణామాలతో వీసా దారులు మరియు గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ఇకపై నేరుగా ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులను లేదా వారి ప్రాంతంలోని కాంగ్రెస్ ప్రతినిధులను సంప్రదించాల్సి వస్తుంది. ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావంతో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి టెక్ సంస్థలు తమ హెచ్1బీ ఉద్యోగులకు ప్రయాణాల విషయంలో ఆంక్షలు పెట్టడంపై ఆలోచిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీసా సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన రికార్డులు సిద్ధంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో వలసదారుల భవిష్యత్ మరింత అనిశ్చితంగా మారింది.
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
This website uses cookies.