Donald Trump : వామ్మో ట్రంప్ మరో షాక్ ఇచ్చాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Donald Trump : వామ్మో ట్రంప్ మరో షాక్ ఇచ్చాడుగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :7 April 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Donald Trump : వామ్మో ట్రంప్ మరో షాక్ ఇచ్చాడుగా..!

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వీసా దారులు, గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నవారికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధ్యక్ష పదవిలోకి వచ్చినప్పటి నుంచే వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్, తాజాగా హెచ్1బీ, ఎఫ్1 వీసాలు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు సహాయం చేసే హెల్ప్ డెస్క్‌ను సస్పెండ్ చేశారు. ఇది వలసదారులకు, ముఖ్యంగా భారతీయులకు పెద్ద షాక్‌గా మారింది.

Donald Trump వామ్మో ట్రంప్ మరో షాక్ ఇచ్చాడుగా

Donald Trump : వామ్మో ట్రంప్ మరో షాక్ ఇచ్చాడుగా..!

Donald Trump ట్రంప్ దెబ్బకు విలవిలలాడుతున్న వీసాదారులు, గ్రీన్ కార్డుదారులు

ఈ నిర్ణయంతో అమెరికాలో వలస సేవలు అందించే సీఐఎస్ అంబుడ్స్‌మన్ కార్యాలయ సిబ్బందిని 60 రోజులపాటు పరిపాలనా సెలవుపై పంపించారు. వీసా అప్లికేషన్‌లలో జాప్యాలు, సమస్యలు ఎదురైనవారు ఇక్కడి హెల్ప్ డెస్క్‌ను సంప్రదించి పరిష్కారాలు పొందేవారు. ఇప్పుడు ఈ సేవలు నిలిపివేయడం వల్ల సంవత్సరానికి సుమారు 30,000 మంది ప్రజలకు దాదాపు ఆదుకున్న సహాయం అంతరించనుంది. న్యాయ నిపుణులు ఈ చర్యను స్వతంత్ర ఇమ్మిగ్రేషన్ పర్యవేక్షణ సంస్థను రద్దు చేసే తొలి అడుగుగా అభివర్ణిస్తున్నారు. ఇది సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌పై పెద్ద ప్రభావం చూపనుంది.

ఈ పరిణామాలతో వీసా దారులు మరియు గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ఇకపై నేరుగా ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులను లేదా వారి ప్రాంతంలోని కాంగ్రెస్ ప్రతినిధులను సంప్రదించాల్సి వస్తుంది. ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావంతో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి టెక్ సంస్థలు తమ హెచ్1బీ ఉద్యోగులకు ప్రయాణాల విషయంలో ఆంక్షలు పెట్టడంపై ఆలోచిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీసా సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన రికార్డులు సిద్ధంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో వలసదారుల భవిష్యత్ మరింత అనిశ్చితంగా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది