
Political Parties : బడా కంపెనీలు కోట్లు గుమ్మరించాయి.. ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం..!
Political Parties : రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం బహిర్గతం చేసింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అందజేసిన వివరాలను శుక్రవారం సాయంత్రం (మార్చి 15)లోగా ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఎస్‌బీఐ నుంచి డేటా అందుకున్న ఈసీఐ గడువుకు ఒక రోజు ముందుగానే బాండ్ల వివరాలను వెల్లడించింది. మొత్తం 763 పేజీలతో కూడిన డేటాను రెండు భాగాలుగా డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఈసీఐ.జీవోవీ.ఇన్‌లో అప్‌లోడ్ చేసింది. ఎవరు ఎన్ని బాండ్లు? ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే వివరాలు ఇందులో ఉన్నాయి. పార్ట్-1లో ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలను పొందుపరిచింది. అలాగే పార్ట్-2లో బాండ్లను రిడీమ్ చేసుకున్న రాజకీయ పార్టీలు, తేదీలు, డబ్బు మొత్తం తదితర వివరాలను ఉంచింది.రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు అందించిన అగ్రశేణి సంస్థలలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మేఘా ఇంజనీరింగ్, పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్, అపోలో టైర్స్, లక్ష్మి మిట్టల్, ఎడల్‌వ్యూస్, పీవీఆర్, కెవంటర్, సులా వైన్, వెల్‌స్పన్, సన్‌ఫార్మా, టోరెంట్ పవర్, భారతీ ఎయిర్‌టల్, డీఎల్‌ఎఫ్, వేదాంత తదితర సంస్థలు ఉన్నాయి. ఇదే జాబితాలో ప్రముఖ సంస్థలైన ముత్తూస్ ఫైనాన్స్ లిమిటెడ్, పెగాసస్ ప్రాపర్టీస్, ఫినోలెక్స్ కేబుల్స్, జీహెచ్‌సీఎల్, జిందాల్ పాలీ ఫిల్మ్స్, ఐటీసీ లిమిటెడ్ ఉన్నాయి.
ఎస్‌బీఐ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు భారీమొత్తంలో విరాళాలు సమర్పించిన వారిలో గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ (లాటరీ మార్టిన్), మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా మొదటి వరుసలో నిలిచాయి. వైర్ కథనం ప్రకారం, లాటరీ మార్టిన్ మొత్తంగా రూ.2,177 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేయగా, హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ ర ూ.1588 కోట్ల విలువైన బాండ్లను ఖరీదు చేసింది. లాటరీ మార్టిన్ సంస్థ 2019 నుంచి ఇప్పటి వరకు రూ. కోటి విలువ కలిగిన 1368 బాండ్లను కొనుగోలు చేసినట్లు ఈ డేటాలో వెల్లడైంది. లైవ్‌మింట్ కథనం ఇందుకు భిన్నంగా లాటరీ మార్టిన్ రూ.1368 కోట్లు, మేఘా సంస్థ రూ.980 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసినట్లు పేర్కొంది.
– ఇక బాండ్ల ద్వారా అధిక మొత్తంలో విరాళాలు పొందిన రాజకీయ పార్టీలలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ మొదటి స్థానంలో అందరికంటే ఎంతో ఎత్తులో నిలిచింది. తర్వాతి స్థానాల్లో టీఎంసీ కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, బీఆర్‌ఎస్, డీఎంకే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జేడీఎస్, ఎన్‌సీపీ, జేడీయూ, ఆర్జేడీ, ఆప్, ఎస్‌పీ, తదితర పార్టీలున్నాయి. రూ.10వేలు, రూ. 1 లక్ష, రూ.1 కోటి డినామినేషన్లలో ఎస్‌బీఐ ఎన్నికల బాండ్లను విక్రయించింది.
– జనవరి 2024 వరకు విక్రయించిన బాండ్ల విలువ రూ.24, 738 కోట్లు.
– రెండు ప్రధాన జాతీయ పార్టీలలో బీజేపీకి అత్యధికంగా 46.74శాతం (రూ.11,562.5కోట్లు), కాంగ్రెస్‌కు 11.39 శాతం (రూ. 2,818కోట్లు) అందాయి.
– విరాళలో రెండవ అతిపెద్ద లబ్ధిదారు తృణమూల్ కాంగ్రెస్.. ఈ పార్టీకి మొత్తం విరాళాలలో 13శాతం (రూ.3,215 కోట్లు) అందాయి.
– భారత్ రాష్ట్ర సమితికి 9.21 శాతం(రూ.2278.37కోట్లు), బీజేడీకి 6.27శాతం (రూ.1550కోట్లు) విరాళాలు అందాయి. నాలుగైదు స్థానాల్లో ఈ రెండు పార్టీలు నిలిచాయి.
– టాప్-10లో డీఎంకే (రూ.1230కోట్లు), వైఎస్‌ఆర్ కాంగ్రెస్ (రూ 662కోట్లు), తెలుగుదేశం (రూ.437.76కోట్లు), శివసేన (రూ.316కోట్లు), ఆర్‌జేడీ (రూ.145కోట్లు) పార్టీలున్నాయి.
– ఆమ్ ఆద్మీపార్టీకి రూ.130.9కోట్లు, జనతాదళ్ సెక్యులర్ రూ.87కోట్లు, సిక్కిం క్రాంతిమోర్చా రూ.73కోట్లు విరాళాల రూపంలో పొందాయి.
– టాప్-5 దాతలలో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ (రూ2,177 కోట్లు), మేఘా ఇంజనీరింగ్ (రూ.1588కోట్లు), హల్దియా ఎనర్జీ (రూ.752కోట్లు), వేదాంత (రూ729.3కోట్లు), క్విక్ సప్లయి చైన్ (రిలయన్స్ సంస్థ రూ.658కోట్లు) ఉన్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.