
Good News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త
Good News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్తగా 8వ వేతన కమిషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కమిషన్ జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిషన్ ద్వారా దాదాపు 50 లక్షల కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు, ఇతర అలవెన్సులు సవరించడం జరుగుతుంది.
Good News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త
ఈ కమిషన్ సిఫార్సుల ప్రకారం.. జీతాల్లో గణనీయమైన పెంపు ఉండొచ్చని అంచనా. NC-JCM సూచించిన 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఉపయోగిస్తే, కనీస జీతం రూ.18,000 నుండి రూ.51,480కి పెరిగే అవకాశముంది. అలాగే కనీస పెన్షన్ రూ.9,000 నుండి రూ.25,740కి పెరగొచ్చు. ఇది ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా, దేశీయ వినియోగం పెరగడానికీ దోహదపడుతుందని భావిస్తున్నారు. అంతేగాక, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) కింద అందించే బీమా కవరేజీ కూడా నూతనంగా సవరించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న CGHS స్కీమ్‌లో బీమా ప్రీమియం, సబ్‌స్క్రిప్షన్ రేట్లు 1990లో నాల్గవ వేతన సంఘం సమయంలో నిర్ణయించినవే కావడంతో, ఇవి మార్కెట్ ధరలకి అనుగుణంగా లేవని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే బీమా కవరేజ్‌ను రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల వరకూ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల జీవన వ్యయం, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డియర్‌నెస్ అలవెన్స్ (DA) సహా ఇతర ప్రయోజనాల్లో మార్పులు చేయాలని ఈ కమిషన్ సూచించనుంది. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) 2025లో ఖరారవుతాయి. ఉద్యోగుల జీవన నాణ్యతను మెరుగుపరచే దిశగా ఈ కమిషన్ కీలకంగా మారనుంది.
Blue Berries : మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
This website uses cookies.