
Guar : గోరు చిక్కుడు ఎంత పని చేసిందో తెలుసా..? ముగ్గురి ప్రాణాలు తీసింది..!
Guar : కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జులై 22న జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. గోరుచిక్కుడు కూర తినడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను రమేష్ (35), అతని కుమార్తెలు నాగమ్మ (8), దీప (6)గా గుర్తించారు. సోమవారం రాత్రి రమేష్ కుటుంబం గోరుచిక్కుడు కూర, అన్నం, రోటీ, సాంబార్ తినగా, మంగళవారం తెల్లవారు జామున వారు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రికి తరలించేలోపే ముగ్గురు మృతిచెందారు. భార్య పద్మావతి, ఇద్దరు పిల్లలు కృష్ణ (11), చైత్ర (10) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు…
Guar : గోరు చిక్కుడు ఎంత పని చేసిందో తెలుసా..? ముగ్గురి ప్రాణాలు తీసింది..!
ఈ సంఘటన సిర్వార్ తాలూకా కె. తిమ్మాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడు రమేష్ నాయక్ తన పొలంలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఆదివారం పొలంలోని గోరుచిక్కుడు ఇంటికి తీసుకురావడంతో, సోమవారం ఆ కూర వండుకుని కుటుంబమంతా భోజనం చేశారు. అయితే పొలంలో కూరగాయలకు పురుగుల మందు పిచికారీ చేయడంతో, ఆ ప్రభావమే గోరుచిక్కుడు కాయలపై పడి ఉంటుందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ విషాద ఘటనపై కవితల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇంతకుముందు కూడా జులై 16న కలబురగి జిల్లాలో ఇదే తరహా ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం తర్వాత ఒక ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురై అస్వస్థతకు లోనయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడిన విద్యార్థులను గంగావర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. రాష్ట్రంలో తరచూ వంటకాల్లోని విషపూరిత పదార్థాల వల్ల ప్రజలు బాధపడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.