YS Jagan : జగనన్నను ఎదుర్కోలేక ఇంట్లో ఆడవాళ్లను ట్రోల్ చేయడానికి సిగ్గు లేదు.. వైసీపీ మహిళా నేత ఫైర్

Authored By Breaking News 2 | The Telugu News | Updated on: October 27, 2023, 1:20 am

YS Jagan : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబును అరెస్ట్ చేయడం అక్రమం అంటూ టీడీపీ నేతలు ఫైర్ అవుతుంటే.. ఆయన్ను అరెస్ట్ చేయడం ఏమో కానీ.. టీడీపీ నేతల అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం అని వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు. తాజాగా గుంటూరు వైసీపీ మహిళా నేత నూరి చంద్రబాబు అండ్ కోపై సీరియస్ అయ్యారు. టీడీపీ నేతలు మనుషులా లేక నరరూప రాక్షసులా. ఎక్కడ చూసినా జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక ఆయన కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసి వాళ్లపై విమర్శలు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్క మహిళకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ప్రతి చోట జగన్ కు జేజేలు పలుకుతున్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు జగన్ అయితే.. మహిళలను దూషించే నాయకులు టీడీపీ వాళ్లు. ఎక్కడ చూసినా కూడా మహిళలను దూషిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.

వాళ్ల పార్టీ నుంచే బయటికి వచ్చి ఇబ్బంది పడ్డాము.. ఇబ్బంది పెట్టారు అని మహిళా నేతలు చెబుతున్నారు. జనాలంతా టీడీపీ వాళ్లను చీకొడుతున్నారు. రాజకీయంగా జగన్ ను ఎదుర్కోలేక వ్యక్తిగతంగా ఆయన కుటుంబ సభ్యుల మీద మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతూ వాళ్లు ఏ ఆనందం పొందుతున్నారో తెలియడం లేదు. ఎక్కడైనా కూడా సంక్షేమం, అభివృద్ధి చేస్తున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అయితే దాన్ని ఎదుర్కోలేక ప్రతి కుటుంబంలో జగన్ మోహన్ రెడ్డి ఒక అన్నలా, సొంత వాళ్లలా ప్రతి ఒక్కరికి చూసుకుంటున్నారు. మైనార్టీల్లోనే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. షాదీ తోఫా అనే దానికి పదో తరగతి లిమిటేషన్ పెట్టి వాళ్లు కూడా చదువుకోవాలని ప్రోత్సహించారు. అలా ఎవ్వరైనా ఆలోచించగలరా? టీడీపీ వాళ్లు ప్రతి విషయంలో మహిళలు, పెద్ద స్థాయిలో ఉండకూడదు. మహిళలు మాతో సమానంగా ఉండకూడదు అని అనుకునే పార్టీ టీడీపీ మాత్రమే. జగన్ మోహన్ రెడ్డికి, టీడీపీకి చాలా వ్యత్యాసం ఉంది. ఎలాంటి నైతిక విలువలు లేని పార్టీ టీడీపీ. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ వైసీపీ అని ఆమె స్పష్టం చేశారు.

 

YS Jagan : మహిళలకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యత ఏ నాయకుడూ ఇవ్వలేదు

అసలు మహిళలకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యత ఏ నాయకుడూ ఇవ్వలేదు అని నూర్ అన్నారు. ఈ పార్టీలో ఉన్నంత కంఫర్ట్ జోన్.. ఎవ్వరైనా సమానమే. మనమందరం ఒక్కటే. మనకు ఉన్న కంఫర్ట్ జోన్ వైసీపీలో నాయకుల దగ్గర్నుంచి.. కార్యకర్తల దగ్గర్నుంచి.. ప్రతి ఒక్కరికి ఒక కంఫర్ట్ జోన్ ఉంది. ఆ పార్టీలో ఎక్కడ చూసినా కూడా ప్రలోభాలు, ఇబ్బందులు తప్ప అవేవీ కనిపించవు. టీడీపీ, జనసేన వాళ్లకు ప్రజల ఆదరణ కానీ.. వాళ్ల మీద ఏం కనిపించట్లేదు. జగన్ చేస్తున్న డెవలప్ మెంట్ కానీ.. సంక్షేమం కానీ.. దాన్ని ఎదుర్కోలేకపోతున్నారు.. అని నూరి స్పష్టం చేశారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp