Categories: Newspolitics

USA-Iran: నాపై హత్యాయత్నమే జరిగితే..ఇరాన్‌‌ను భూమ్మీదే లేకుండా చేస్తాం: ట్రంప్‌ వార్నింగ్‌

Advertisement
Advertisement

USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి అందులో ఇరాన్ పాత్ర ఉందని నిర్ధారణ అయితే ఆ దేశాన్ని భూమిపై నుంచి పూర్తిగా తుడిచివేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. తన భద్రత విషయంలో అమెరికా ఎలాంటి రాజీ పడదని అవసరమైతే అత్యంత కఠిన చర్యలకు కూడా సిద్ధమేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇది కేవలం హెచ్చరిక కాదని ముందస్తు ఆదేశమేనని ఆయన మాటలు తీవ్రతను చాటుతున్నాయి.

Advertisement

USA-Iran: నాపై హత్యాయత్నమే జరిగితే..ఇరాన్‌‌ను భూమ్మీదే లేకుండా చేస్తాం: ట్రంప్‌ వార్నింగ్‌

ఇరాన్ కౌంటర్ వార్నింగ్: చేతిని నరికేస్తాం

ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ నుంచి ఘాటు స్పందన వచ్చింది. ఇరాన్ భద్రతా దళాల ప్రతినిధి మాట్లాడుతూ..తమ దేశంపై లేదా తమ నాయకత్వంపై ఎవరైనా దురాక్రమణకు ప్రయత్నిస్తే ఆ చేయిని నరికేస్తామని హెచ్చరించారు. ట్రంప్‌కు తమ సామర్థ్యం బాగా తెలుసని ఒకవేళ అమెరికా దాడులకు పాల్పడితే వారి ప్రపంచాన్నే తగలబెట్టే శక్తి తమకు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయనే సంకేతంగా మారాయి. ఇప్పటికే దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ విభేదాలు ఇప్పుడు మరింత ప్రమాదకర దశకు చేరుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

ఇరాన్ నిరసనలు, ఖమేనీ ఆరోపణలు

ఇదిలా ఉండగా డిసెంబర్ నెల నుంచి ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి పాలక వ్యవస్థపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలకు అమెరికా అధ్యక్షుడే కారణమని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఆరోపించారు. ఈ నిరసనల వెనుక అమెరికా కుట్ర ఉందని ఆయన విమర్శించారు. మరోవైపు ఇరాన్‌లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందంటూ ట్రంప్ బహిరంగంగా నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. ఖమేనీ సుదీర్ఘ పాలన ముగియాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ఏదైనా దాడి జరిగితే దానికి తగిన రీతిలో ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఇక నిరసనల విషయంలోనూ కలవరపెట్టే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు సుమారు 5 వేల మంది మృతి చెందినట్లు దాదాపు 26 వేల మందిని అరెస్టు చేసినట్లు కథనాలు వెల్లడించాయి. ఈ మరణాలకు అమెరికానే బాధ్యత వహించాలంటూ ఖమేనీ ఆరోపించారు. ట్రంప్ హెచ్చరికలు, ఇరాన్ ప్రతిస్పందనలు, అంతర్గత నిరసనలతో మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ప్రపంచ శాంతికి ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

Recent Posts

Mega Family : బాబాయ్-అబ్బాయి తెరపై కనిపిస్తారా?.. డైరెక్టర్ ఎవరంటే ?: పవన్–చరణ్ కాంబోపై ఆసక్తికర అప్డేట్

Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…

37 minutes ago

MLA Turns Delivery Boy : డెలివరీ బాయ్ అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే..! కారణం ఏంటో తెలుసా ?

MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…

3 hours ago

KBR Park : హైదరాబాద్ నగరవాసులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు !!

KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…

4 hours ago

Nari Nari Naduma Murari : బాలకృష్ణ పరువు నిలబెట్టిన యంగ్ హీరో !!

సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…

5 hours ago

Chiranjeevi Davos : దావోస్ కు చిరంజీవి ఎందుకు వెళ్లినట్లు..? అక్కడ సీఎం రేవంత్ పని ఏంటి ?

Chiranjeevi Davos : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…

5 hours ago

Kisan Vikas Patra 2026 : పోస్ట్ ఆఫీస్‌లో సూపర్ హిట్ పథకం..ఒక్కసారి పెట్టుబడి పెడితే కాలక్రమేణా రెట్టింపు..వివరాలు ఇవే!

Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…

6 hours ago

Gold Price on Jan 21 : తగ్గినట్లే తగ్గి..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర..ఈరోజు తులం బంగారం ఎంతంటే?

Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…

8 hours ago

Karthika Deepam 2 Today Episode : జ్యోత్స్న రహస్యం బయటపడే ప్రమాదం.. ఆగ్రహంతో ఊగిపోయిన శివ నారాయణ

Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…

8 hours ago