G7 Countries : జీ7 దేశాల మద్దతు కూడా భారత్ కే..ఇక పాక్ పని పూర్తిగా అయిపోయినట్లే
G7 Countries : పాక్ వైఖరి పట్ల ప్రపంచ దేశాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ అంతర్జాతీయ మద్దతును సమర్థవంతంగా కూడగట్టగలిగింది. పాక్ మాత్రమే కాకుండా పీఓకేలోని ఉగ్రశిబిరాలపై దాడులతో భారత్ కీలక విజయాలను సాధించింది. వందల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో ప్రపంచ దేశాల దృష్టి భారత వైపు మళ్లింది. పాక్ యుద్ధోన్మాద చర్యలు దిగజారుతున్నట్లు అవగాహన కలగడంతో గ్లోబల్ ఫోరమ్స్ నుంచి భారత దృక్కోణానికి మద్దతు లభిస్తోంది.
G7 Countries : జీ7 దేశాల మద్దతు కూడా భారత్ కే..ఇక పాక్ పని పూర్తిగా అయిపోయినట్లే
అత్యంత కీలకమైన ఈ సమయంలో జీ7 దేశాలు కూడా పాక్‌పై పరోక్షంగా ఒత్తిడి పెంచే ప్రకటన జారీ చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాలు ఒకే ప్రకటన విడుదల చేసి, పాక్ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ దాడుల నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌తో పాక్ గడ్డు పరిస్థితిలో పడింది. అంతర్జాతీయంగా మద్దతు లేకుండా పోవడంతో పాక్ పరాజయం పాలవుతుంది. అమెరికా ఇప్పటికే జోక్యం చేయబోమని తేల్చి చెప్పడంతో పాక్ ఆశలు చిగురించక ముందే చిగురించిపోయాయి.
ఇక జీ7 దేశాలు భారత్, పాకిస్తాన్‌లను సంయమనం పాటించాలని, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించాయి. యుద్ధం కొనసాగితే ప్రాంతీయ స్థిరత్వానికి ప్రమాదమని హెచ్చరించాయి. ఇదే సమయంలో భారత్ తన సైనిక చర్యలతో పాక్ డ్రోన్లను నేలమట్టం చేస్తూ, సరిహద్దుల్లో గట్టి పటిష్టతను కొనసాగిస్తోంది. ప్రధాని మోదీ ప్రత్యక్షంగా ఆపరేషన్ సింధూర్‌ను పర్యవేక్షిస్తూ, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Chiranjeevi | అభిమానం హద్దులు దాటి, జీవితాన్నే పణంగా పెట్టి తన అభిమాన నటుడిని కలవాలని పట్టుదలగా ప్రయత్నించిన ఓ మహిళా…
War 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 .కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన…
Barrelakka | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో “బర్రెలక్క”గా అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్గా నిలిచింది.…
Hansika | స్టార్ హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు హల్చల్ చేస్తున్న…
LOBO | టీవీ నటుడు, బిగ్బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…
Sleep | మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో…
Clove Side Effects | లవంగం అనేది మన ఇండియన్ కిచెన్లో తప్పనిసరి సుగంధ ద్రవ్యం. వండిన ఆహారానికి రుచి,…
Health Tips | పాలు, పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలుగా ఎంతో మందికి తెలిసిందే. అయితే…
This website uses cookies.