India Pak War : ఆప‌ద‌లో ఆదుకుంటే భార‌త్‌కే ఆ దేశం వెన్నుపోటు పొడిచిందా ?

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 11, 2025, 8:00 pm
  •  India Pak War : ఆప‌ద‌లో ఆదుకుంటే భార‌త్‌కే ఆ దేశం వెన్నుపోటు పొడిచిందా ?

India Pak War : కొంద‌రికి మ‌నం సాయం చేసిన ఆ సాయాన్ని గుర్తించ‌కుండా మ‌నకే ఆప‌ద త‌ల‌పెడదామ‌ని చూస్తూ ఉంటారు. యుద్దం స‌మ‌యంలో ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇండియాకు మద్దతుగా నిలవగా, ఒక్క దేశం మాత్రం పాకిస్థాన్‌కు అండగా నిలిచింది. ఆ దేశం మరేదో కాదు టర్కీ. ఆ దేశం మొదటి నుంచి కూడా ఇండియాపై తన అక్కస్సును వెళ్లగక్కుతూ వస్తోంది. టర్కీ ఎల్లప్పుడూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతూ వస్తోంది.

India Pak War : ఆప‌ద‌లో ఆదుకుంటే భార‌త్‌కే ఆ దేశం వెన్నుపోటు పొడిచిందా ?

India Pak War : ఆప‌ద‌లో ఆదుకుంటే భార‌త్‌కే ఆ దేశం వెన్నుపోటు పొడిచిందా ?

India Pak War వెన్ను పోటు..

టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అనేక అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్‌ను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ భారత్‌ను విమర్శించారు. 2023లో టర్కీ భారీ భూకంపానికి గురైంది. ఈ సమయంలో ఇవేమి పట్టించుకుని భారత్, టర్కీకి ఆపన్న హస్తం అందించింది.టర్కీలో సంభవించిన భూకంపం సమయంలో భారత్ మానవతా సహాయం అందించింది. ఆపరేషన్ దోస్త్ పేరిట టర్కీకి భారీ సాయం చేసింది భారత్. కానీ టర్కీ మాత్రం తన వక్ర బుద్ధిని బయటపెట్టింది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టర్కీ పాకిస్తాన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా ఆయుధాలు పంపించి ఆ దేశానికి అండగా నిలిచింది. టర్కీ ఇచ్చిన డ్రోన్లతోనే పాకిస్థాన్ ఇండియాపై దాడికి దిగింది. అయితే ఆ డ్రోన్లను భారత్ ఆర్మీ కూల్చి వేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఎలాగూ ఇండియాపై యుద్ధం గెలవలేమని భావిచించిన పాకిస్థాన్, అమెరికా కాళ్లు పట్టుకుని యుద్ధాన్ని ఆపించింది.

Ramalingaiah Tandu

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp