TRS : తెరాసలో మొదలైన కలవరం.. కీలక నేత కొత్త పార్టీ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TRS : తెరాసలో మొదలైన కలవరం.. కీలక నేత కొత్త పార్టీ..?

 Authored By brahma | The Telugu News | Updated on :1 March 2021,12:33 pm

TRS : తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పార్టీల హంగామా కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల కొత్త పార్టీ పెట్టటానికి సర్వం సిద్ధం చేసుకుంటుంది. ఇది ఒక రకంగా తెలంగాణలో రాజకీయ దుమారం లేపుతుంది. ఆమె పెట్టబోయే పార్టీ వలన లాభపడేది ఎవరు..? నష్టపోయేది ఎవరు..? అనేది అర్ధం కానీ విషయం. ఇదిలా ఉంటే మరోపక్క తెరాస లో కీలక నేత ఒకరు ఆ పార్టీ నుండి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టబోతున్నాడు అనే టాక్ ఇప్పుడు తెరాస వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తుంది.

టీఆర్ఎస్‌లో నిరాదరణకు గురవుతున్న ఉద్యమ తెలంగాణ బ్యాచ్‌లోని కొంత మంది ముఖ్యులు ఈ పార్టీ పనిలో ఉన్నారని టీఆర్ఎస్ ముఖ్యులు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. తెలంగాణలో కొందరు కొత్త పార్టీ పెట్టాలని చూస్తున్నారని.. వేరే పార్టీలకు అవకాశం లేదని గంగుల చెబుతున్నారు. 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని.. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని తేల్చేశారు. కొత్త పార్టీ పెట్టె నేతలు ఎవరయ్యా అంటే మంత్రి ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

TRS : ఉద్యమ నేతలు వర్సెస్ బంగారు తెలంగాణ నేతలు

గత కొద్దీ కాలంగా సీఎం కేసీఆర్ కు ఈటెలకు మధ్య అంతగా పొసగటం లేదనే విషయం అందరికి తెలుసు, గతంలోనే ఈటెల బహిరంగంగా ఉద్యమ నేతలకు పార్టీలో అన్యాయం జరుగుతుందని, అసలు తెరాస అంటేనే ఉద్యమ నేతల పార్టీ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు , అప్పటినుండి గులాబీ పార్టీలో ఉద్యమ నేతలు వర్సెస్ బంగారు తెలంగాణ నేతలు అన్నట్లు పరిస్థితి మారిపోయింది.

తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీలోని సీనియర్ నేతలకు ఒక్కో జిల్లా బాధ్యతలు అప్పగించాడు కేసీఆర్. అయితే ఈటెల రాజేందర్ కు మాత్రం ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. పైగా ఎమ్మెల్సీ మరియు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై చర్చించటానికి ఏర్పరిచిన సమావేశానికి ఈటెలకు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. దీనితో ఈటెల కరీంనగర్ వెళ్ళిపోయాడు. ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. దీనితో ఈటెల బాగా మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది.

etela rajednar

etela rajednar

ఈటెలకు అంత సత్తా ఉందా..?

అయితే ఈటెల రాజేందర్ ఇప్పుడు పార్టీ పెట్టె పరిస్థితిలో లేదని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. సొంతగా పార్టీ పెట్టి కేసీఆర్ కు వ్యతిరేకంగా నడిపించటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక వేళా ఈటెల పార్టీ పెడితే అందులో తెరాస కు చెందిన కీలక ఉద్యమ నేతల హస్తం ఉంటే తప్ప, సొంతగా మాత్రం ఈటెల రాజేందర్ పార్టీ పెట్టె యోచనలో లేడు . కానీ మంత్రి గంగుల కమలాకర్ మాత్రం సమయం చిక్కిన ప్రతిసారి కొందరు కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఒక్క మంత్రి గంగుల కమలాకర్ ఒక్కడే కొత్త పార్టీ గురించి మాట్లాడుతున్నాడు తప్పితే , మిగిలిన తెరాస నేతలెవరూ దాని గురించి మాట్లాడటం లేదు. బహుశా అతనికి మాత్రమే పార్టీ హైకమెండ్ ఈ విషయంలో పర్మిషన్ ఇచ్చింది ఏమో.

Advertisement
WhatsApp Group Join Now

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది