Vanga Geetha : వంగా గీతా జనసేనలో చేరుతున్నారా.. నిజమెంత..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vanga Geetha : వంగా గీతా జనసేనలో చేరుతున్నారా.. నిజమెంత..?

Vanga Geetha : రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ కావడం సర్వ సాధారణం అయిపోయింది. ఇప్పుడు వంగా గీత విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. వంగా గీత పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టారు. అసలు వంగా గీత నిజంనేగానే జనసేనలో చేరుతున్నారా? ఆమెకు ఆ అవసరం ఉందా అంటూ ప్రచారం జరుగుతోంది. వంగా గీత విషయంలో మొదటనే పవన్ కల్యాన్‌ తన అభిప్రాయం ఏంటో చెప్పేశారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 May 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Vanga Geetha : వంగా గీతా జనసేనలో చేరుతున్నారా.. నిజమెంత..?

Vanga Geetha : రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ కావడం సర్వ సాధారణం అయిపోయింది. ఇప్పుడు వంగా గీత విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. వంగా గీత పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టారు. అసలు వంగా గీత నిజంనేగానే జనసేనలో చేరుతున్నారా? ఆమెకు ఆ అవసరం ఉందా అంటూ ప్రచారం జరుగుతోంది. వంగా గీత విషయంలో మొదటనే పవన్ కల్యాన్‌ తన అభిప్రాయం ఏంటో చెప్పేశారు. ఆమె చాలా మంచి నాయకురాలని అభినందించారు. అంతే కాకుండా ఆమె రాజకీయ జీవితం ప్రజారాజ్యం పార్టీతోనే ప్రారంభమైందని గుర్తుచేశారు.

Vanga Geetha జగన్ ధీమా..

ఆమె కూడా త్వరలోనే జనసేనలో చేరుతారంటూ చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్‌. ఇప్పుడు పోలింగ్ కు కొన్ని రోజుల ముందు నుంచే చాలా మంది వైసీపీ నేతలు టీడీపీ కూటమిలో చేరుతున్నారు. ఇప్పటికే పై స్థాయి నేతల నుంచి కింది స్థాయి నేతల వరకు చాలా మంది జనసేనలో చేరారు. 150కి పైగా సీట్లు గెలుస్తున్నామని జగన్ చెబుతున్నా కింది స్థాయిలో గ్రౌండ్ లెవల్లో ఆ పరిస్థితులు కనిపించట్లేదు. దాంతో పాటు ఇటు కూటమి సభ్యులు కూడా తామే అధికారంలోకి వస్తున్నామని చెబుతున్నారు. 120కి పైగా సీట్లు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది వైసీపీని వీడేందుకు రెడీ అవుతున్నారు. కూటమిలోని టీడీపీ లేదా జనసేనలో చేరేందుకు వారంతా సిద్ధం అవుతున్నారు.

Vanga Geetha వంగా గీతా జనసేనలో చేరుతున్నారా నిజమెంత

Vanga Geetha : వంగా గీతా జనసేనలో చేరుతున్నారా.. నిజమెంత..?

ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే తమ బెర్త్ లను ముందే కన్ఫర్మ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ పని చేస్తున్నారు. ఇందులో భాగంగానే వంగా గీత పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ గెలుపు ఖాయమని.. మెజార్టీ పైనే అంచనాలు ఉన్నాయంటున్నారు. పైగా వంగా గీతకు గతంలో చిరంజీవి కుటుంబంతో ఎంతో అనుంబంధం ఉంది. మొన్న ఓ ఛానెల్ లో మాట్లాడుతూ తనకు చిరంజీవి అంటే అభిమానం అని, పవన్ ను ఎప్పుడూ విమర్శించలేదంటూ తెలిపింది. భవిష్యత్ లో కూడా విమర్శించబోనంటూ చెప్పారు. దాంతో ఆమె చేసిన వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్‌ పార్టీలో త్వరలోనే వంగా గీత చేరుతారంటూ ప్రచారం ఊపందుకుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది