Chandrababu : నా జీవితంలో ఎంతో మంది సీఎం ల‌ను చూశాను కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు : చంద్రబాబు.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : నా జీవితంలో ఎంతో మంది సీఎం ల‌ను చూశాను కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు : చంద్రబాబు.. వీడియో

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2025,9:20 pm

ప్రధానాంశాలు:

  •  ప్రజావేదిక కూల్చివేతకు నేటికీ 6 ఏళ్లు..

  •  Chandrababu : నా జీవితంలో ఎంతో మంది సీఎం ల‌ను చూశాను కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు : చంద్రబాబు

Chandrababu : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే జగన్‌ పాలన ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చన్నారు. అమరావతిలో జరిగిన “సంవిధాన్ హత్య దివస్” కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. దేశంలో అత్యవసర పరిస్థితులు విధించబడిన జూన్‌ 25వ తేదీకి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో, చంద్రబాబు ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తుచేశారు. అలాగే, ఆ కాలంలో ప్రజాస్వామ్యం ఎలా నాశనమైందో వివరిస్తూ, ఏపీలో గత ఐదేళ్ల పాలన కూడా దానికి సరిపోలే చీకటి పాలనగా అభివర్ణించారు.

Chandrababu నా జీవితంలో ఎంతో మంది సీఎం ల‌ను చూశాను కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు చంద్రబాబు వీడియో

Chandrababu : నా జీవితంలో ఎంతో మంది సీఎం ల‌ను చూశాను కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు : చంద్రబాబు.. వీడియో

Chandrababu ఇదే రోజు ఏపీలో విధ్వంస పాలనకు తొలి అడుగు పడింది – చంద్రబాబు

“నా జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశాను. కానీ జగన్ లాంటి పాలకుడిని ఎప్పుడూ చూడలేదు” అంటూ విమర్శలు గుప్పించారు. అవినీతి, అక్రమాలు, ప్రజా హక్కుల నిరాకరణ, భూకబ్జాలు, ప్రశ్నించే వాణిని అణిచివేత వంటి అరాచకాలను జగన్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్నారని ఆరోపించారు. తనకు ఎదురైన సమస్యలు, మిత్రుడు పవన్ కళ్యాణ్‌కు తట్టుకున్న అవమానాలను కూడా గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం రక్షణ కోసం తాము పవన్ కళ్యాణ్‌, నరేంద్ర మోదీతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు.

ఎమర్జెన్సీ అనేది చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయిందని, అది ప్రజాస్వామ్యాన్ని ఎలా అణచివేస్తుందో చూపించే ఉదాహరణ అని చంద్రబాబు వివరించారు. ప్రజల వద్ద ఉన్న ఓటు హక్కే అంబేడ్కర్ అందించిన శక్తివంతమైన ఆయుధమని, మంచి పాలనను ఎంచుకోవడమే ప్రజల బాధ్యత అన్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి, తిరిగి గెలుపొందిన సందర్భాన్ని ఉదాహరించి ప్రజాస్వామ్యానికి ప్రజలే రక్షకులని చెప్పారు. తాము ఇప్పుడు విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు దేశాన్ని, రాష్ట్రాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది