Jamili Elections : కేంద్రం ఇరుకున పడబోతుందా.. మోదీ నిర్ణయం టీడీపీ,జనసేనలకి ఇబ్బందిగా మారనుందా?
ప్రధానాంశాలు:
Jamili Elections : కేంద్రం ఇరుకున పడబోతుందా.. మోదీ నిర్ణయం టీడీపీ,జనసేనలకి ఇబ్బందిగా మారనుందా?
Jamili Elections : ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.ఇటీవల జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర తెలపడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. దేశంలో వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడంతో దేశ ప్రగతికి ఆటంకం ఏర్పడుతోందని బీజేపీ వాదిస్తోంది. ఇక ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారాన్ని దక్కించుకుంటూ తమదైన పాలన చేస్తుంది. ఇప్పుడు మోదీ తీసుకోబోయే నిర్ణయం టీడీపీ, జనసేన పార్టీలని ఇబ్బంది పెట్టబోతున్నట్టుగా అర్ధమవుతుంది.
Jamili Elections ఏ నిర్ణయమైన రిస్కే..
1991లో అయోధ్య-రామజన్మభూమి ఉద్యమం నేపథ్యంలో బాబ్రీ మసీదు కూల్చివేత ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు పీవీ నరసింహారావు ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. . 1947 ఆగస్టు 15 నాటికి ఏ మతానికి చెందిన ప్రార్ధనా స్థలాలను కూడా ఇతర మతాలకు ఇవ్వకుండా యథాతథంగా ఉంచాలని ఈ చట్టం చెబుతోంది. అయితే దీన్ని ఉల్లంఘించి అప్పట్లో బాబ్రీ మసీదును కర సేవకులు కూల్చేశారు. ఆ తర్వాత దేశంలో దాదాపు 10 చోట్ల మసీదులు, దర్గాలను తమ ఆలయాలపై కట్టారని ఆరోపిస్తూ హిందూ సంస్థలు స్థానిక కోర్టుల్ని ఆశ్రయించాయి. సుప్రీంకోర్టులో ప్రార్ధనా స్థలాల చట్టం అమలు కోరుతూ పలు పిటీషన్స్ కూడా దాఖలు అయ్యాయి.
అయితే నాలుగు వారాలలో దీనికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్ట్ ఆదేశించింది. అయితే దీంతో మోదీ ప్రభుత్వం ఇరుకున పడేలా కనిపిస్తుంది. ఇన్ని రోజులు హిందూత్వ అజెండాతో మధుర, సంభాల్, అజ్మీర్ దర్గాపై స్ధానిక నేతలతో పిటిషన్లు వేయిస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం చెప్పబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఆలయాలకి అనుకూలంగా మాట్లాడితే హిందుత్వ అజెండా అంటారు. అలాగని తటస్థంగా ఉన్నా కూడా హిందూ సంస్థలు, ఆరెస్సెస్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్ధితుల్లో కేంద్రంతో పాటు టీడీపీ, జనసేన పార్టీలు కూఆ ఇరుకున పడడం ఖాయం. అయితే ఇలాంటి సమయంలో మోదీ.. ఆ రెండు పార్టీల నుండి ఏవైన సలహాలు తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది.