Pawan Kalyan – Chandrababu : జనసేన పోటీ చేస్తున్న స్థానాలు ఇవే.. చంద్రబాబు ఆఫర్ కు ఓకే చెప్పేసిన పవన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan – Chandrababu : జనసేన పోటీ చేస్తున్న స్థానాలు ఇవే.. చంద్రబాబు ఆఫర్ కు ఓకే చెప్పేసిన పవన్

Pawan Kalyan – Chandrababu : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమరం స్టార్ట్ అయింది. ఇంకా నాలుగు నెలలు కూడా ఎన్నికలు లేవు. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. నిజానికి ఏపీలో ఎన్నికలు అంటేనే ఆ హడావుడి వేరే ఉంటుంది. మామూలుగా ఉండదు. రచ్చ రచ్చే ఉంటుంది. అయితే.. ఈసారి ఏపీలో ద్విముఖ పోటీలాగానే కనిపిస్తోంది. అధికార వైసీపీ ఒకవైపు అయితే.. మరోవైపు టీడీపీ, జనసేన నిలబడ్డాయి. త్వరలోనే బీజేపీ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :19 December 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

  •  కొలిక్కి వచ్చిన జనసేన టికెట్ల అంశం

  •  28 సీట్లలో పోటీ చేయబోతున్న జనసేన

Pawan Kalyan – Chandrababu : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమరం స్టార్ట్ అయింది. ఇంకా నాలుగు నెలలు కూడా ఎన్నికలు లేవు. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. నిజానికి ఏపీలో ఎన్నికలు అంటేనే ఆ హడావుడి వేరే ఉంటుంది. మామూలుగా ఉండదు. రచ్చ రచ్చే ఉంటుంది. అయితే.. ఈసారి ఏపీలో ద్విముఖ పోటీలాగానే కనిపిస్తోంది. అధికార వైసీపీ ఒకవైపు అయితే.. మరోవైపు టీడీపీ, జనసేన నిలబడ్డాయి. త్వరలోనే బీజేపీ కూడా టీడీపీ, జనసేన కూటమితో కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. ఈనేపథ్యంలో టీడీపీ పార్టీ జనసేన అభ్యర్థులకు ఎన్ని సీట్లు ఇస్తుంది అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.

అసలు జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనే దానిపై తాజాగా క్లారిటీ వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిశారు. ఈనేపథ్యంలో పొత్తులపై ఇద్దరు డిస్కస్ చేశారు. అసలు జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి. ఏ నియోజకవర్గంలో ఇవ్వాలి. అధికారంలోకి ఈ కూటమి వస్తే.. ఎవరు అధికారాన్ని పంచుకుంటారు అనే దానిపై ఇద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. అయితే.. జనసేన పార్టీకి 28 టికెట్లు మాత్రమే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారట. ఎక్కువగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మాత్రం టికెట్ల విషయంలో క్లాష్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎంపీ టికెట్లు కూడా జనసేనకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరినట్టు తెలుస్తోంది.

Pawan Kalyan – Chandrababu : జనసేనకు ఇవ్వబోయే స్థానాలు ఇవే

ఓవరాల్ గా జనసేన పార్టీకి టీడీపీ కేటాయించబోయే స్థానాలు ఇవే అని తెలుస్తోంది. నెల్లిమర్ల, భీమిలి, గాజువాక, ఎలమంచిలి లేదా పెందుర్తి, పాడేరు, రాజానగరం, రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పిఠాపురం, పీ గన్నవరం, రాజోలు, నర్సాపురం, భీమవరం, తాడేపల్లి, ఉంగుటూరు లేదా ఏలూరు, నిడదవోలు లేదా తణుకు, కొవ్వూరు, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, పెడన, తెనాలి, గుంటూరు వెస్ట్, గిద్దలూరు, దర్శి, నెల్లూరు, తిరుపతి, మదనపల్లి, రాజంపేట నియోజకవర్గాల్లో టీడీపీ.. జనసేనకు టికెట్లు కేటాయించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది