Home » Andhra Pradesh » Junior Ntr Fans Slogans In Chandrababu Meeting
andhra pradesh

Chandrababu – Jr NTR : బిగ్ బ్రేకింగ్.. చంద్రబాబు రోడ్ షోలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ CM నినాదాలు .. సభ ఆపేసి వెళ్ళిపోయిన బాబు !

Authored By
Breaking News 2
The Telugu News | Published on: April 14, 2023, 9:00 am
Advertisement

Chandrababu – Jr NTR : అయిపాయె.. ఏదైతే జరగొద్దు అని అనుకున్నారో అదే జరుగుతోంది. టీడీపీ పార్టీలోనే ఆ పేరు వినిపించకూడదని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నో ప్రయాసలు పడితే.. ఇప్పుడేంటి ఇలా అంతా రివర్స్ అయింది అని చంద్రబాబు బాధపడే రోజులు వచ్చేశాయి. అవును.. మనం మాట్లాడుకునేది జూనియర్ ఎన్టీఆర్ గురించే. టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఆ పార్టీకి కొత్త ఉత్సాహం రావడం ఖాయం అని.. ఆ పార్టీ ఏపీలో గెలవడం కూడా ఖాయం అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, పలు రాజకీయ వేత్తలు కూడా చెబుతున్న మాట ఇది.

Advertisement

junior ntr fans slogans in chandrababu meeting

కానీ.. 2009 ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం సినిమాల మీదనే ఉంది. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని, టీడీపీ పార్టీని తన చేతుల్లోకి తీసుకొని పార్టీని ముందుండి నడిపించాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ మేనియా మరోసారి కనిపించింది. కృష్ణా జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పర్యటనలో భాగంగా మచిలీపట్నంలో ర్యాలీగా వెళ్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, తారకరత్న ఫోటోలతో అభిమానులు హల్ చల్ చేశారు.

Advertisement

Chandrababu – Jr NTR : ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు

ఇదివరకు కుప్పంలో చంద్రబాబు పర్యటించినప్పుడు కూడా ఎన్టీఆర్ ఫోటోలను ఆయన అభిమానులు ప్రదర్శించి ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేసిన విషయం తెలిసిందే. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ నినాదాలు చేశారు. తాజాగా చంద్రబాబు పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోలేదు. విజయవాడ నుంచి మచిలీపట్నానికి భారీ ర్యాలీగా చంద్రబాబు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆయన ఫ్లెక్సీలతో నినాదాలు చేశారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి