KCR VS Revanth Reddy : కాంగ్రెస్‌దే అధికారం.. ఎట్టకేలకు కేసీఆర్ కూడా ఒప్పేసుకున్నాడు?
ప్రధానాంశాలు:
కాంగ్రెస్ పేరునే కలవరిస్తున్న సీఎం కేసీఆర్
కాంగ్రెస్ గెలుపు తనకు కనిపించిందా?
కేసీఆర్ మాటల్లోని ఉద్దేశం ఏంటి?
KCR VS Revanth Reddy : తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 10 రోజులే సమయం ఉంది. ఈ 10 రోజుల్లో చేయాల్సిందంతా పార్టీలు చేస్తున్నాయి. 10 రోజుల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నాయి. ఇన్ని రోజులు ఒక లెక్క.. ఈ 10 రోజులు ఇంకో లెక్క. ఈ 10 రోజుల్లో ఓటర్లను ఎంత మేరకు తమ వైపునకు లాక్కోవాలో.. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలో బలంగా ఎదుగుతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీకే చుక్కలు చూపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. చివరకు కేసీఆర్ కూడా తన ప్రసంగాల్లో కాంగ్రెస్ నే కలవరిస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఏం జరుగుతుంది.. కాంగ్రెస్ గెలిస్తే పవర్ పోతుంది.. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు పోతుంది.. అంటూ కాంగ్రెస్ గెలుపు గురించే మాట్లాడుతున్నారు కేసీఆర్. మంత్రి కేటీఆర్ కూడా అదే జపం చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ గెలవదు అనేది చెప్పకుండా.. కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తారు అంటూ కాంగ్రెస్ గెలుపును వీళ్లే కన్ఫమ్ చేస్తున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. 10 ఏళ్ల పాటు పాలించినా కూడా బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత వచ్చింది. కర్ణాటకలో గెలుపు తర్వాత కాంగ్రెస్ ఒక్కసారిగా తెలంగాణలో పుంజుకుంది. అయినా కూడా తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని బీఆర్ఎస్ పార్టీ నమ్ముతోంది. కాంగ్రెస్ కూడా ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ రాష్ట్ర రాజకీయాలు మారుతున్నాయి. తెలంగాణకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే రావడం, వరంగల్ లో పాదయాత్ర చేయడంతో పాటు మేనిఫెస్టో విడుదల చేశారు. ఇది కాంగ్రెస్ కు ప్లస్ పాయింటే. ఈనేపథ్యంలో కేసీఆర్ టోన్ మార్చేశారు. తొలుత చెప్పిన చెప్పినట్టుగా బీఆర్ఎస్ ను గెలిపిస్తే అనే నినాదాన్ని పక్కన పెట్టి.. కాంగ్రెస్ ను గెలిపించకండి.. ఓడించండి అంటున్నారు.
KCR VS Revanth Reddy : బీఆర్ఎస్ ను గెలిపించండి అనే నినాదాన్ని పక్కన పెట్టిన కేసీఆర్
బీఆర్ఎస్ ను గెలిపించండి అనే నినాదాన్ని పక్కన పెట్టిన కేసీఆర్.. కాంగ్రెస్ ను గెలిపిస్తే జరిగేది ఇదే అంటూ కాంగ్రెస్ గెలుపు గురించే మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డికి పీఠం దక్కితే అంటూ పదే పదే రేవంత్ రెడ్డినే కలవరిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉండటంతో బీఆర్ఎస్ నేతలకు వణుకు పుట్టినట్టుగా అనిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ దూకుడు బీఆర్ఎస్ కు తిప్పలు పెట్టేలా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.