KCR – Congress : కాంగ్రెస్ బలం ఇదీ… ఒప్పేసుకున్న కేసీఆర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR – Congress : కాంగ్రెస్ బలం ఇదీ… ఒప్పేసుకున్న కేసీఆర్

 Authored By kranthi | The Telugu News | Updated on :19 October 2023,5:00 pm

KCR – Congress : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెలా 10 రోజుల సమయం మాత్రమే ఉంది. అంతకుమించి ఇంకా ఎక్కువ సమయం లేదు. అందుకే ఎన్నికల ప్రచారాన్ని పార్టీలన్నీ ముమ్మరం చేశాయి. ఓవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ తరుపున ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు. సీఎం కేసీఆర్ రోజూ బిజీ పర్యటన చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలంటూ కోరుతున్నారు. మూడోసారి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు అంతే స్పీడ్ గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాస్త పుంజుకున్న విషయం తెలిసిందే. చాలామంది ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి చేరుతున్నారు. ఇప్పటికే 55 మందితో తొలి లిస్టును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రెండో లిస్టు కూడా త్వరలోనే ప్రకటించనుంది.

కాంగ్రెస్ కు ఒక్కసారిగా ఊపు రావడంతో ఈసారి గెలుపు అంత ఈజీ కాదని బీఆర్ఎస్ పార్టీ నమ్ముతోంది. అందుకే ఈసారి హామీలను కూడా లెక్కలేకుండా గుప్పిస్తున్నారు. మేనిఫెస్టో చూస్తే మామూలుగా లేదు. దిమ్మతిరిగిపోతోంది. మేనిఫెస్టోలో చాలా సంక్షేమ పథకాలను యాడ్ చేశారు. కేసీఆర్ బీమా, సన్నబియ్యం లాంటి పథకాలు అయితే హైలెట్ అని చెప్పుకోవాలి. రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ సన్న బియ్యం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. అలాగే.. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా కేసీఆర్ బీమాను వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ మాటిచ్చారు. ఇలా ఆసరా పెన్షన్లు, రైతు బంధు.. ప్రతి పథకం లిమిట్ ను పెంచేశారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీకి భయపడే అని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.

kcr admits the strength of congress

#image_title

KCR – Congress : 2018 లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవా?

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునాయసంగా గెలిచింది. కానీ.. 2023 లో ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకుంది. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదని కేసీఆర్ కూడా గ్రహించారు. అందుకే ఈసారి తానే రంగంలోకి దిగి మరీ.. ప్రజలను వేడుకుంటున్నారు. పథకాలన్నీ కంటిన్యూ కావాలంటే ఖచ్చితంగా మరోసారి గెలిపించాలంటూ ప్రజలను వేడుకుంటున్నారు. చూద్దాం మరి ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు గెలిపిస్తారో లేదో?

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది