KCR – Revanth Reddy : ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సీఎం క్యాండిడేట్ ఎవరు అంటే టక్కున వచ్చే సమాధానం రేవంత్ రెడ్డి. అవును.. పేరుకు చాలామంది కాంగ్రెస్ నేతలు ఉన్నా.. సీనియర్స్ ఉన్నా.. కాంగ్రెస్ కు ప్రస్తుతం ఉన్న బలం వచ్చేలా చేసింది రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాకపోయి ఉంటే.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా ఉండేది కాదు. రేవంత్ చాలా కష్టపడి తెలంగాణలో పార్టీని బలోపేతం చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మీద విమర్శనాస్త్రాలు సంధించాలంటే రేవంత్ రెడ్డి తర్వాతనే ఇంకెవరైనా. ఆయన మాటలు కూడా తూటల్లా పేలుతాయి. కొడంగల్ లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజే వేరు. అందుకే.. కొడంగల్ లో రేవంత్ రెడ్డిని దెబ్బ తీయడం కోసం సీఎం కేసీఆర్ అక్కడ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డిపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఒట్టి ఆల్తు ఫాల్తు మాటలు తప్పితే ఇంకేం లేదు. వీడిని తిట్టి.. వాడిని తిట్టి నోరు పారేసుకోవడం తప్పితే ఏమైనా పని జరిగిందా కొడంగల్ లో. నరేందర్ రెడ్డి వచ్చినంక ఎంత పని జరిగింది. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కేటీఆర్.. కొడంగల్ ను దత్తత తీసుకున్నారు. అందుకే.. నేడు కొడంగల్ కు అన్నీ వచ్చాయి. మీరు నిర్ణయించుకోవాలి. పని చేసే నరేందర్ రెడ్డి కావాలా.. లేక ఫాల్తు మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి కావాలా.. ఆయన నోరు తెరిస్తే గబ్బు. కాంగ్రెస్ పార్టీ వాళ్లే చెబుతున్నారు. టికెట్లు అమ్ముకున్నడు.. మా దగ్గర డబ్బులు తీసుకున్నడు అని గాంధీ భవన్ మీద రాళ్లు విసిరారు.
తెలంగాణ ఉద్యమంలో మనం కొట్లాడే నాడు.. ఆంధ్రోళ్ల సంకల్లో ఉన్నడు. తెలంగాణ ఉద్యమకారుల మీదికి తుపాకి పట్టుకొని పోయిండు. తెలంగాణ వచ్చింది. మంచిగా నడుపుకుంటున్నం. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసిండు. రాష్ట్రాన్ని అస్థిర పరచడానికి 50 లక్షలు ఇచ్చి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. మీరంతా చూశారు కదా టీవీల్లో. పోలీసులు పట్టుకెళ్లి జైలులో వేశారు. చిప్పకూడు తిన్నా సిగ్గు రాలేదు. ఆయనకు అది మెడల్ అట. అట్ల దొరకడమే మెడల్. పథకం అంటడు. ఒకడు వంకరగా పుట్టిండట. ఎందుకు వంకరగా పుట్టావు అంటే.. సక్కగ ఉన్నోడిని విమర్శించడానికి అన్నాడట. అలా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
ఉస్మానియా విద్యార్థులు అడ్డాకూలీలట.. తాగుబోతులట. జర్నలిస్టులను పండబెట్టి తొక్కుతడట. నరేందర్ రెడ్డి ఎప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడిండా? కాంగ్రెస్ లో 15 మంది ఉన్నరు.. నేనంటే నేను ముఖ్యమంత్రి అని. వీళ్లు ముఖ్యమంత్రి ఎప్పుడు కావాలి. కాంగ్రెస్ గెలిస్తే కదా. కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. ఏం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఈ జన్మలో జరగదు. నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ఆయన స్థాయి పెరుగుతుంది.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.