Kodali Nani : సిట్టింగ్ లను మార్చుతున్న జగన్.. గుడివాడ టికెట్ విషయంలో ముందే క్లారిటీ ఇచ్చేసిన కొడాలి నాని | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kodali Nani : సిట్టింగ్ లను మార్చుతున్న జగన్.. గుడివాడ టికెట్ విషయంలో ముందే క్లారిటీ ఇచ్చేసిన కొడాలి నాని

 Authored By kranthi | The Telugu News | Updated on :23 December 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  జగన్ మోహన్ రెడ్డి ఏనాడో యుద్ధం ప్రకటించారు?

  •  మీరు ఇప్పుడు యుద్ధం ప్రకటిస్తున్నారా?

  •  చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై కొడాలి నాని ఫైర్

Kodali Nani : వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏంటో అందరికీ తెలుసు. ఈయన మాజీ మంత్రి కూడా. కొడాలి నానిని ఎవరైనా టచ్ చేస్తే ఇక వాళ్లు మసి కావాల్సిందే. కొడాలి మాటలకు ఎవ్వరైనా తమ నోరు మూసుకోవాల్సిందే. ఆయన పంచ్ వేస్తే ఇక తిరిగి చూసుకునే చాన్స్ కూడా ఉండదు. వైసీపీ పార్టీపై, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై, వైసీపీ నాయకులపై ఎవరైనా నోరుజారితే వెంటనే కొడాలి నాని రంగంలోకి దిగుతారు. ముఖ్యంగా టీడీపీ నేతలను, పవన్ కళ్యాణ్ ను మాత్రం తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు కొడాలి నాని. వైసీపీలో ఈసారి సిట్టింగ్ లను జగన్ మార్చుతున్నారనే వార్తలు రోజూ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు కాస్త వెకిలిగా మాట్లాడటంపై కొడాలి స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి 2009 సెప్టెంబర్ 2 న రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పటి నుంచి యుద్ధం ప్రకటించారు. సోనియా గాంధీ, చంద్రబాబును ఢీకొట్టి 16 నెలలు జైలులో ఉండి ఈ రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ కు డిపాజిట్లు పోగొట్టి కాంగ్రెస్ ను ఈ రాష్ట్రంలో కూకటి వేళ్లతో సహా పెకిలించి.. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును 23 సీట్లకు పరిమితం చేసి 151 సీట్లతో పవన్ కళ్యాణ్ ను రెండు చోట్ల చిత్తుచిత్తుగా ఓడించి, నారా లోకేష్ ను మంగళగిరిలో మట్టికరిపించి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్రయాత్ర కొనసాగిస్తున్నారన్నారు.

పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు యుద్ధభేరీ మోగిస్తున్నారు. 2009 లోనే జగన్ యుద్ధబేరి మోగించారు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. ఈరోజు యుద్ధబేరి మోగించడం కాదు. పవన్, చంద్రబాబు, లోకేష్.. ఇంకొకడు అందరూ కలిసి వచ్చినా జగన్ వెంట్రుక కూడా పీకలేరు. వైసీపీకి 50 శాతం పైన ఓటింగ్ ఉంది. జగన్ సంక్షేమ పథకాలు చూసి రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. అందులో ఒక శాతం బీజేపీ, పవన్ కళ్యాణ్ కు ఒక శాతం.. ఇలా అన్నీ కలిపి ఉంటాయి. చంద్రబాబు అంటేనే 420 గాడు. జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను మార్చుతున్నారట. నువ్వు చంద్రగిరిలో అప్పుడు పోటీ చేశావు కదా. ఇప్పుడు కుప్పంలో ఎందుకు పోటీ చేస్తున్నావు. చంద్రగిరి నుంచి నువ్వు కుప్పంలో పోటీ చేయొచ్చా? అన్నీ సొల్లు మాటలు. ట్రాన్స్ ఫర్స్ ఉంటాయని తెలియదు అంటూ మాట్లాడుతున్నాడు. 30 ఏళ్ల కిందనే నువ్వు వెళ్లావు కదా. నీ కొడుకు పుట్టింది మంగళగిరా? అక్కడ ఎందుకు పోటీ చేశాడు. హైదరాబాద్ లో చేయొచ్చు కదా. లేదంటే వాడి బాబు ఊరు చంద్రగిరిలో పోటీ చేయొచ్చు కదా అంటూ ప్రశ్నించారు.

Kodali Nani : పవన్ కళ్యాణ్ భీమవరంలో పుట్టాడా?

పవన్ కళ్యాణ్ భీమవరంలో పుట్టాడా? చంద్రబాబు నటన చూస్తే ఎన్టీఆర్ సిగ్గు పడతారు. నా అల్లుడు దొంగనా కొడుకు అని ఎన్టీఆరే చెప్పారు. మందు మీరు ఎమ్మెల్యేలుగా గెలిస్తే చాలు.. మీరు జగన్ మోహన్ రెడ్డితో యుద్ధం చేసేదేంటి అంటూ కొడాలి నాని మండిపడ్డారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది