
Siddharth : స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న సిద్దార్థ్..?
Siddharth : ఈ నడుమ హీరో, హీరోయిన్ల పెళ్లిళ్లు అనేవి కామన్ అయిపోతున్నాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడే లవ్ మ్యారేజీలు ఎక్కువ అవుతున్నాయి. అది కూడా ముందుగా ఇద్దరూ డేటింగ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. అందుకే హీరో, హీరోయిన్ల పెళ్లిళ్లకు ఇప్పుడు క్రేజ్ ఎక్కువగా పెరిగిందనే చెప్పుకోవాలి. రీసెంట్ గానే రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీని పెళ్లిచేసుకుంది. అటు తాప్సీ కూడా సీక్రెట్ గా పెళ్లి చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సౌత్ లో కూడా ఓ ప్రేమజంట పెళ్లి పీటలు ఎక్కినట్టు తెలుస్తోంది.
ఆ జంట ఎవరో కాదు లవర్ బాయ్ సిద్దార్థ్, అదితి రావు హైదరీ. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. అటు సిద్దార్థ్ గతంలో చాలా మందితో డేటింగ్ చేశాడు. సమంత, త్రిష, హన్సిక, శృతిహాసన్ తో పాటు మరో ఇద్దరితో డేటింగ్ చేశాడు. అంతే కాకుండా అతనికి ఓ అమ్మాయితో పెళ్లి అయి విడాకులు కూడా అయ్యాయి. ఇటు అదితి రావు హైదరి కి కూడా ఇంతకు ముందే పెళ్లి అయి విడాకులు అయ్యాయి. కాగా వీరిద్దరూ మహాసముద్రం సినిమాలో నటిస్తున్నప్పుడే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచే ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అదితి తరచూ చెన్నైకి వెళ్లి సిద్దార్థ్ ఇంట్లోనే ఉంటుందని టాక్.
Siddharth : స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న సిద్దార్థ్..?
ఈ క్రమంలోనే ఇద్దరూ తమ పెళ్లికి ఇంట్లో వారిని ఒప్పించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తెల్లవారు జామున ఇద్దరూ పెళ్లిపీటలు ఎక్కినట్టు సమాచారం. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఇద్దరూ పెళ్లిచేసుకున్నారంట. ఈ వార్త ఉదయం నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. కేవలం అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. వనపర్తి సంస్థానాధీశుల వారసులలో అదితి కూడా ఒకరు. అందుకే ఈ ఆలయంలో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఎందుకో ఈ విషయాన్ని ఇద్దరూ సీక్రెట్ గా ఉంచుతున్నారు.అదితి చాలా కాలంగా సిద్దార్థ్ తో ప్రేమయాణం నడిపిస్తోంది. ఇద్దరూ బహిరంగంగానే తిరుగుతున్నారు. ఆ మధ్య కాలంలో సిద్దార్థ్ ఇంట్లోనే అదితి ఉందని అంటున్నారు. కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది ఇంత వరకు తెలియదు.
Johnny Master : చిక్రీ సాంగ్‌లో హుక్ స్టెప్ ఐడియా నాది కాదు.. అసలు విషయం బయటపెట్టిన జానీ మాస్టర్…
Telangana Municipal Results 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రతి ఓటు ఎంత విలువైందో చాటిచెప్పే ఆసక్తికర…
AP Govt Good news to New Pensions : ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల అంశంపై శాసనమండలి వేదికగా ప్రభుత్వం మరియు…
Telangana Municipal Polls 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని…
Rajya Sabha : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి సమయం దగ్గరపడుతుండటంతో, అధికార కూటమిలో అభ్యర్థుల…
Fruits : ఆరోగ్యకరమైన ఆహారం అంటే చాలా మంది ముందుగా గుర్తుచేసుకునేది పండ్లే. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే…
Alcohol : మనలో చాలామంది మద్యం తాగడాన్ని ఒక సాధారణ అలవాటుగా లేదా సరదాగా భావిస్తుంటారు. కానీ మీరు తాగే…
Gold, Silver Rate Today, 13 February 2026 : ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ముంగిట ఉన్న తరుణంలో, ఆకాశాన్నంటుతున్న…
This website uses cookies.