
KTR : సీఎం రేవంత్ ఇజ్జత్ తీసిన కేటీఆర్
KTR : తెలంగాణలో రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బిఆర్ఎస్ , కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు, అలాగే ప్రస్తుతం నెలకొన్న సమస్యల పై స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండిస్తూ, ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను “అసమర్ధత” పాలన కు అద్దంపట్టేలా ఉన్నాయన్నారు.
తనకు అప్పులు పుట్టడం లేదని.. ఢిల్లీకి వెళ్తే తనను దొంగలా చూస్తున్నారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమే కదా అన్న చందంగా కేటీఆర్ పోల్చారు. దొంగను దొంగగానే చూస్తారని కాంగ్రెస్ పార్టీ దొంగలచేతికి తాళాలిచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని సీఎం కుర్చిలో కూర్చొపెట్టి రాహుల్ గాంధీ , కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పు చేసిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనకే ఆగమైందని , ఎన్నికల ముందు కూడా అధికారంలోకి వస్తామనే నమ్మకం లేకనే అమలు కానీ హామీలు , అమలు చేయలేని వాగ్ధానాలు చేసిందని..ఇప్పుడు వాటిని నెరవేర్చలేక తమ అసమర్ధతను బయటపెట్టుకుంటోందని ఎద్దేవా చేశారు.
KTR : సీఎం రేవంత్ ఇజ్జత్ తీసిన కేటీఆర్
కచ్చితంగా ప్రజల తరపున అడుగుతాం.. వదిలిపెట్టం. పరిపానల చేతగాకపోతే తప్పుకో.. రాజీనామా పెట్టు నాతో అయితలేదు అని.. ఢిల్లీకి మూటలు పంపుడు.. ఇక్కడ మేనేజ్ చేసుడు నాతోటి అయితలేదు అని, చేతులేత్తేస్తున్నా.. ఐపీ డిక్లేర్ చేస్తున్న అని వెళ్లిపో. అంతేకానీ తెలంగాణను తిడుతా అంటే ఇన్నాళ్లు ఉపేక్షించాం.. ఇక నుంచి ఊరుకోం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.