Earthquake in Bangkok : బ్యాంకాక్ లో భారీ భూకంపం.. అంతా అల్లకల్లోలం.. వీడియో !
ప్రధానాంశాలు:
Earthquake in Bangkok : బ్యాంకాక్ లో భారీ భూకంపం.. అంతా అల్లకల్లోలం..!
Earthquake in Bangkok : థాయ్‌లాండ్ Thailand రాజధాని బ్యాంకాక్ Bangkok మరియు మయన్మార్‌లో Myanmar వరుస భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల ప్రభావంతో బ్యాంకాక్‌లో Bangkok నిర్మాణంలో ఉన్న భారీ భవనం కూలిపోవడంతో చుట్టుపక్కల తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. భూకంపాల ప్రభావంతో మెట్రో, రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభుత్వం వెంటనే అత్యవసర సహాయ చర్యలు చేపట్టింది.

Earthquake in Bangkok : బ్యాంకాక్ లో భారీ భూకంపం.. అంతా అల్లకల్లోలం.. వీడియో !
ఈ భూకంపాల ధాటికి 43 మంది అదృశ్యమయ్యారు. అధికారులు ప్రాథమిక పరిశీలనలో అదృశ్యమైన వారంతా కూలిన భవన శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. సహాయ బృందాలు శిథిలాల నుంచి బతికున్నవారిని కాపాడేందుకు కృషి చేస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు కలిసి పనిచేస్తున్నాయి.
ఈ పరిస్థితుల దృష్ట్యా థాయ్‌లాండ్ ప్రధాని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, సహాయ చర్యల గురించి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు, సహాయ బృందాలు ప్రజల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సాయం అందించేందుకు ప్రత్యేక దళాలను రంగంలోకి దించారు. సహాయ కార్యక్రమాలు మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Many buildings were reportedly destroyed in the 7.7 magnitude earthquake in Myanmar.
Video showing people being rescued from the rubles of the collapsed buildings.
Pray for Myanmar 🇲🇲 🙏🏻#Myanmar #earthquake #แผ่นดินไหว pic.twitter.com/7yPoGXMBvK
— Sumit (@SumitHansd) March 28, 2025