Earthquake : దేశంలో వరుస భూకంపలు.. భయం గుప్పిట్లో ప్రజలు..!
ప్రధానాంశాలు:
Earthquake : దేశంలో వరుస భూకంపలు.. భయం గుప్పిట్లో ప్రజలు..!
Earthquake : నేపాల్‌లో శుక్రవారం సాయంత్రం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం సాయంత్రం 7:52 గంటల సమయంలో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూప్రకంపనలు సంభవించిన వెంటనే అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చాలా మంది తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Earthquake : దేశంలో వరుస భూకంపలు.. భయం గుప్పిట్లో ప్రజలు
Earthquake నేపాల్‌లో భారీ భూకంపం..
ఈ భూప్రకంపనల ప్రభావం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ కనిపించిందని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో చిన్నచిన్న వస్తువులు కదలినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగిందని సమాచారం లేదు.
ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో భూకంపాలపై ప్రజల్లో ఉన్న ఆందోళన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని భావిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉన్నప్పటికీ, మరోసారి ప్రకృతి కోపానికి ఎదురయ్యే అవకాశం ఉండటంతో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయి.