Roja : పవన్ కళ్యాణ్ గురించి అడిగితే మళ్లీ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని.. భారీ మెజార్టీతో గెలుస్తా అన్న రోజా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roja : పవన్ కళ్యాణ్ గురించి అడిగితే మళ్లీ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని.. భారీ మెజార్టీతో గెలుస్తా అన్న రోజా

Roja : ఏపీ మంత్రి రోజా గురించి తెలుసు కదా. తను వైసీపీలో ఫైర్ బ్రాండ్ అనే చెప్పుకోవాలి. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. వైసీపీకి వీరవీధేయురాలిగా ఉంటుంది రోజా. అందుకే సీఎం జగన్ కు కూడా రోజా అంటే చాలా ఇష్టం. తను వైసీపీలో ఉంటే జగన్ కు చాలా దైర్యంగా ఉంటుంది. జగన్ పై ఈగ కూడా వాలనివ్వదు రోజా. తాజాగా హైదరాబాద్ లో మీడియా మీట్ సందర్భంగా పలు కీలక విషయాలు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :18 October 2023,5:00 pm

Roja : ఏపీ మంత్రి రోజా గురించి తెలుసు కదా. తను వైసీపీలో ఫైర్ బ్రాండ్ అనే చెప్పుకోవాలి. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. వైసీపీకి వీరవీధేయురాలిగా ఉంటుంది రోజా. అందుకే సీఎం జగన్ కు కూడా రోజా అంటే చాలా ఇష్టం. తను వైసీపీలో ఉంటే జగన్ కు చాలా దైర్యంగా ఉంటుంది. జగన్ పై ఈగ కూడా వాలనివ్వదు రోజా. తాజాగా హైదరాబాద్ లో మీడియా మీట్ సందర్భంగా పలు కీలక విషయాలు చెప్పుకొచ్చారు రోజా. తనకు వైజాగ్ అంటే.. వైజాగ్ బీచ్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చారు. తన తొలి మూవీ చామంతి సినిమా షూటింగ్ అంతా ఆ బీచ్ లోనే జరిగిందని.. ఈ భీమిలి హౌస్ లోనే ఉన్నామని.. నేను యాక్ట్ చేసిన వైజాగ్ అంటే నాకు ఇష్టం. అలాగే.. నాకు టూరిజం మంత్రిత్వ శాఖ రావడం, మళ్లీ వైజాగ్ బీచ్ ను డెవలప్ చేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు రోజా.

మరోవైపు తెలంగాణలో హైదరాబాద్ అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు రోజా. హైదరాబాద్ దాటి ఎక్కడికి వెళ్లలేదు. ఇక్కడిక్కడే తిరిగాను. మా నాన్న సౌండ్ ఇంజనీర్ గా ఇక్కడే పని చేశారు కాబట్టి నేను ఇక్కడే పుట్టా. నాలుగో తరగతి వరకు ఇక్కడే చదివా. హైదరాబాద్ అందరికీ నచ్చిన ప్లేస్. హైదరాబాద్ ఎటు తిరిగినా బాగానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది రోజా. జగన్ మళ్లీ ముఖ్యమంత్ర అవుతారు.. మేమంతా మళ్లీ ఎమ్మెల్యేలు అవుతాం. ఎందుకంటే ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి 98 శాతం తొలి సారి సీఎం అయిన వెంటనే నాలుగున్నర ఏళ్లలో చేయడం అనేది నభూతో నభవిష్యత్ అని అన్నారు రోజా. ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలో చెప్పండి అంటూ రోజా ప్రశ్నించారు.

minister roja comments on pawan kalyan

#image_title

Roja : ఇద్దరు సన్యాసులు కలిస్తే బూడిదే వస్తుంది

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా ఏం ఇబ్బంది లేదు. ఇప్పటికే చంద్రబాబు ఫెయిల్యూర్ పొలిటిషిన్ అయ్యాడు. జనసేన బోణీనే కాలేదు. ఇద్దరు సన్యాసులు కలిస్తే బూడిదే వస్తుంది తప్ప వాళ్లను చూసి భయపడాల్సిన అవసరం లేదు అని రోజా చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది