Roja : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా నిరసిస్తూ టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు.. చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీదికి వచ్చి తమ గళాన్ని విప్పుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుది అక్రమ్ అరెస్ట్ అని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీకి చెందిన మహిళలంతా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం, తమకు తోచిన విధంగా నిరసన తెలుపుతుంటే.. పోలీసులు అత్యుత్సాహం చూపుతూ అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేసి వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. ఎవ్వరినీ స్వచ్ఛందంగా నిరసన కూడా తెలుపుకోనీయడం లేదు పోలీసులు. దీని వెనుక ఉన్నది వైసీపీ ప్రభుత్వం అని, వైఎస్ జగన్ కావాలని కుట్ర చేసి మరీ చంద్రబాబును అరెస్ట్ చేయించారని నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి మండిపడ్డారు.
తాజాగా చంద్రబాబు అరెస్ట్ కి వ్యతిరేకంగా మోత మోగిద్దాం అనే ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఇది ఒక్క చంద్రబాబు గారికే కాదు.. రాష్ట్ర ప్రజలంతా గెలవాలి.. న్యాయం గెలవాలని ఈ కార్యక్రమం నిర్వహించామని నారా బ్రాహ్మణి అన్నారు. ఆయన తొందరలోనే బయటికి వస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బ్రాహ్మణి. ఈసందర్భంగా డోలు వాయిస్తూ విజిల్ ఊదారు. ఆమెకు మద్దతు తెలుపుతూ అందరూ డోల్లు చప్పుళ్లు, పీకలు ఊదడం, గిన్నెలు, ప్లేట్స్ తీసుకొచ్చి మోత మోగించారు. దీంతో ఆప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఏపీ ప్రజలు మీకు అధికారం ఇస్తే.. మీరు చేసింది ఏంటి.. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా.. వాళ్ల డబ్బును ఈ ఐదేళ్లలో దోచుకున్నాడు చంద్రబాబు. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి గంట కొట్టండి.. జగన్ మోహన్ రెడ్డి సైకో.. ఆయనకు బుద్ధి చెప్పండి అంటున్నారు. బ్రాహ్మణి గారు మీరు తెలియక మాట్లాడుతున్నారా? లేక తెలిసి అబద్ధాలు ట్వీట్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ.. ఈ రాష్ట్రంలోనే పెద్ద సైకో ఎవరైనా ఉన్నారు అంటే.. అది మీ నాన్న బాలకృష్ణ, మీ మామ చంద్రబాబు.. అంటూ రోజా మండిపడ్డారు.
మీ తాతని అంటే మీ నాన్నకి, మీ మామకు అడ్రస్ ఇచ్చి సమాజంలో ఒక గౌరవాన్ని కల్పించి రాజకీయ భవిష్యత్ ఇచ్చిన ఎన్టీఆర్ గారిని చెప్పులేసి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీ లాక్కొని ఆయన చావుకు కారణమైన పెద్ద సైకోలు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు, బాలకృష్ణ. జగన్ పై ఇంకోసారి మాట్లాడితే మర్యాద దక్కదు. ఇన్ని రోజులు నువ్వు రాజకీయం గురించి మాట్లాడలేదు కాబట్టి మేము మాట్లాడలేదు కానీ.. నీ ఇంట్లో వాళ్లు అందరూ ఈ రాష్ట్ర ప్రజలను దోచుకున్నారు.. అంటూ రోజా మండిపడ్డారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.