
Naga Babu : తాను చేసిన ట్వీట్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?
Naga Babu : గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య వార్ నడుస్తున్నట్టుగా అనేక ప్రచారాలు జరగడం మనం చూశాం. బన్నీ కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ ట్యాగ్ లేకుండానే తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడని, ఆయనకి మెగా ఫ్యామిలీతో సంబంధమే లేదన్నట్టుగా ముందుకు పోతున్నాడని ప్రచారాలు జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే సమయంలో జనసేన ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నిన్న ఎన్నికలు ముగిసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన నాగబాబు అల్లు అర్జున్ పేరు పెట్టకుండా ఆసక్తికర పోస్ట్ పెట్టి రచ్చ లేపాడు మాతో ఉంటూ ప్రత్యర్ధులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు.
ఇలా ఎవరిని ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేశాడు అనేది చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఒక్క రోజు ముందు నంద్యాలలోని శిల్పా రవిరెడ్డికి మద్దతు ఇవ్వడం కోసం తన భార్య స్నేహారెడ్డితో కలిసి అక్కడికి వెళ్లాఉ. రవి రెడ్డి నివాసం వద్దకు వచ్చిన వేలాది మంది అభిమానులకు మద్దతు ఇవ్వాలంటూ ఆయన సూచించారు. తన స్నేహితుడిని గెలిపించడానికి వచ్చాను అంటూ తెలిపారు. గతంలో రవి ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా వచ్చి ప్రచారం చేస్తానని మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే తాను వచ్చినట్టు బన్నీ తెలిపాడు.
Naga Babu : తాను చేసిన ట్వీట్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?
అయితే ఎలక్షన్స్ పూర్తయ్యాక బన్నీ సపోర్ట్ చేసిన వ్యక్తి శిల్పా రవిరెడ్డి సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు వయసు మీద పడిందో ఏమో.. ఈ మధ్య ఏం జరిగినా సరే.. ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌ను బయటకు పంపిస్తున్నాడు. ప్యాకేజ్ స్టార్‌ను వాడుకొంటున్నాడు అంటూ కామెంట్స్ చేయడంపై మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు మరోసారి భగ్గుమన్నారు. మన కుటుంబంపై విమర్శలు, ఆరోపణలు చేసేవారికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం ముమ్మాటికి తప్పేనని అన్నారు. అయితే ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో ఓ మీడియా సమావేశంలో రిపోర్టర్ నాగబాబుని ట్వీట్ గురించి అడగ్గా, అది తగలాల్సిన వాళ్లకి గట్టిగానే తగిలిందిలే అనే చెప్పి తప్పించుకున్నాడట. ఈ వార్త వైరల్‌గా మారింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.