Nagababu : జనసేన కిందే టీడీపీ పనిచేయాలి.. నాగబాబు వార్నింగ్?
Nagababu : ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయి 14 రోజులు దాటింది. ఆయన రిమాండ్ కూడా ముగిసినా కూడా ఆయన సీఐడీ అధికారులకు సహకరించడం లేదని చెప్పి మరో 11 రోజులు తన రిమాండ్ ను పొడిగించారు. సీఐడీ అధికారులు కూడా చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారిస్తున్నారు. ఆయన్ను ఎక్కడికీ తీసుకెళ్లి విచారణ చేయడం లేదు. అయితే.. ఒక్క స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ మాత్రమే కాదు.. పుంగనూరు అల్లర్ల కేసులో కూడా ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్ నాథ్ రెడ్డి పేర్లను చేర్చారు. అక్కడ చంద్రబాబు స్పీచ్ అల్లర్లను ప్రభావితం చేసేలా ఉందని సీఐడీ తరుపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.

#image_title
అలాగే.. జడ్జిలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న టీడీపీ నేతలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైకోర్టు, కింది కోర్టుల జడ్జిలపై పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జడ్జీలను అసభ్యకరంగా దూషించారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలి ఏపీ హైకోర్టులో కోర్టు ధిక్కారణ కింద ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ ను దాఖలు చేశారు. అలాగే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో కూడా ఏ14 గా నారా లోకేష్ ను సీఐడీ అధికారులు చేర్చారు.
Nagababu : జనసేన కిందనే టీడీపీ పనిచేయాలన్న నాగబాబు
అయితే.. పవన్ కళ్యాణ్.. చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిసిన తర్వాత ఏపీలో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పొత్తు వ్యవహారంపై పవన్ సోదరుడు నాగబాబు తాజాగా స్పందించారు. టీడీపీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన కిందనే టీడీపీ పనిచేస్తుందని నాగబాబు పేర్కొన్నారు. చిత్తూరు పర్యటనలో ఉన్న ఆయన జనసేన కార్యకర్తలతో సమావేశం అయ్యారు. కార్యకర్తలకు ఆయన సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీ మనకిందే పనిచేయాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తు ఉన్నా సరే టీడీపీ నేతలు మనకిందే పని చేయాలి. టీడీపీతో కలిసి పనిచేసినా జనసేన జెండాను మీరు ముందుకు నడిపించాలని పార్టీ కార్యకర్తలకు నాగబాబు సూచించారు. పవర్ లోకి వస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి.