Nagababu : త‌మ్ముడి కోసం ఏదైనా.. అన్న అంటే నువ్వే బ్ర‌ద‌ర్‌…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nagababu : త‌మ్ముడి కోసం ఏదైనా.. అన్న అంటే నువ్వే బ్ర‌ద‌ర్‌…!

Nagababu : మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు న‌టుడిగా, నిర్మాత‌గా స‌త్తా చాటిన విష‌యం తెలిసిందే. టీవీ షోలు చేసారు. జ‌డ్జిగా కూడా ఆయన రాణించారు. కానీ గత కొన్నాళ్లుగా పూర్తిగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటూ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపులో నాగబాబు కూడా కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా నాగబాబు మీడియా రంగంలోకి రాబోతున్నారు. నాగబాబు […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 August 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Nagababu : త‌మ్ముడి కోసం ఏదైనా.. అన్న అంటే నువ్వే బ్ర‌ద‌ర్‌...!

Nagababu : మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు న‌టుడిగా, నిర్మాత‌గా స‌త్తా చాటిన విష‌యం తెలిసిందే. టీవీ షోలు చేసారు. జ‌డ్జిగా కూడా ఆయన రాణించారు. కానీ గత కొన్నాళ్లుగా పూర్తిగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటూ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపులో నాగబాబు కూడా కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా నాగబాబు మీడియా రంగంలోకి రాబోతున్నారు. నాగబాబు గతంలోనే పలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లు, కామెడీ షోలు చేసారు.

Nagababu మీడియా రంగంలోకి..

అయితే తాజాగా N మీడియా అంటూ నాగబాబు మీడియా రంగంలోకి వస్తున్నాను అని ప్రకటించారు. N మీడియా లోగో రివీల్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు. తన పాత యూట్యూబ్ ఛానల్ కి N మీడియా ఎంటర్టైన్మెంట్స్ అని పేరు మార్చి సరికొత్తగా ప్రారంభించారు.N మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను కొనేశారు. రెండు రోజుల క్రితం ఈ ఛానల్‌కు సంబంధించిన లోగో ఆవిష్కరణ కూడా జరిగిపోయింది. ఈ ఛానల్‌కు ప్రస్తుతం 1 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌కే పరిమితమవుతారని, భవిష్యత్తులో పొలిటికల్‌ న్యూస్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది. నాగబాబు మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Nagababu త‌మ్ముడి కోసం ఏదైనా అన్న అంటే నువ్వే బ్ర‌ద‌ర్‌

Nagababu : త‌మ్ముడి కోసం ఏదైనా.. అన్న అంటే నువ్వే బ్ర‌ద‌ర్‌…!

ప్రస్తుతానికి N మీడియా కేవలం ఎంటర్టైన్మెంట్ న్యూస్ తో పాటు భక్తి న్యూస్, హెల్త్ న్యూస్, పలు ఇంటర్వ్యూలు ప్రేక్షకులకు అందించనున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మాత్రమే కంటెంట్ ఇవ్వనున్నారు. అయితే భవిష్యత్తులో పొలిటికల్ న్యూస్ తో పాటు ఒక వెబ్ సైట్ కూడా స్థాపించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటినుంచి N మీడియాని స్థాపించి మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు జనసేనకు సపోర్ట్ గా ఉండేలా చూసుకుంటారేమో అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే కేవలం యూట్యూబ్ ఛానల్, వెబ్ సైట్ తో ఆగుతారా శాటిలైట్ ఛానల్ కూడా పెడతారా, జనసేనకు N మీడియా కలిసొస్తుందా అని టాలీవుడ్ లో చర్చగా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది