
Nagababu : పెద్దిరెడ్డి, జగన్, ద్వారపూడి.. ఎవరిని వదలకుండా విమర్శలు కురిపించిన నాగబాబు
Nagababu : జనసేన అగ్రనేత నాగబాబు ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన పెద్దిరెడ్డి నుండి ద్వారపూడి వరకు అందరిని విమర్శిస్తూ విమర్శలు సంధించాడు. పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు.అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆరోపించారు. పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని విమర్శించారు. అసెంబ్లీకి రాని పెద్దిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో చెరువులు ఆక్రమించారని ఆరోపించారు.
Nagababu : పెద్దిరెడ్డి, జగన్, ద్వారపూడి.. ఎవరిని వదలకుండా విమర్శలు కురిపించిన నాగబాబు
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం సోమల దగ్గర ‘‘జనంలోకి జనసేన’’ పేరిట జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించిన సమయంలో నాగబాబు ఈ విమర్శలు చేశారు. . ఈ సభలో నాగబాబు పాల్గొని వైసీపీ, పెద్దిరెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అవినీతి చేసిన వైసీపీ నేతలను జైలుకు పంపిస్తామని నాగబాబు హెచ్చరించారు. వైసీపీ ఖాళీ అయిపోతోంది.. వచ్చే ఎన్నికల్లోపు వైసీపీలో ఎవరూ ఉండరని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక్కడ అందరూ పెద్దిరెడ్డికి భయపడతారు… మీరు కూడా జాగ్రత్త అని కొందరు చెప్పారని నాగబాబు వెల్లడించారు. అయితే… పెద్దిరెడ్డి కాదు… ఇంకే రెడ్డి వచ్చినా తాము భయపడబోమని చెప్పానని తెలిపారు.
“పెద్దిరెడ్డికే కాదు… వాళ్ల నాయకుడు జగన్ కు, జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డికే భయపడలేదు… ఇతనెంత! మేం న్యాయంగా, ధర్మంగా ముందుకెళ్లే పవన్ కల్యాణ్ నాయకత్వంలో పనిచేస్తున్నాం… మాకు పెద్దిరెడ్డి కాదు కదా… సుబ్బారెడ్డి, మరో పిచ్చిరెడ్డి వచ్చినా భయపడేది లేదు” అని నాగబాబు స్పష్టం చేశారు. శాసనసభ చుట్టుపక్కలకు రావడానికి కూడా వైసీపీ నేతలకు ధైర్యం సరిపోవడంలేదని నాగబాబు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడంలేదని వైసీపీ నేతలు అంటున్నారని, సభకు వస్తే కదా మైక్ ఇచ్చేది లేనిదీ తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వచ్చి గొంతుక వినిపించాలని ఈ సందర్భంగా జగన్ రెడ్డికి కూడా చెబుతున్నానని అన్నారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడడం మానుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు చూడాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం రాకతో దాదాపు 20 ప్రముఖ కంపెనీలు రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయని, తద్వారా 4 లక్షల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.