Categories: NewsTelangana

Telangana Congress : టి. కాంగ్రెస్ ప‌ట్టు త‌ప్పిందా.. అధికారంలోకి వ‌చ్చాక రేవంత్ రెడ్డికి ఏమైంది..!

Advertisement
Advertisement

Telangana Congress : తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వ‌చ్చింది. అధికారం కోసం రేవంత్ రెడ్డి గ‌ట్టి పోరాట‌మే చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎట్ట‌కేల‌కి అధికారంలోకి రావ‌డం, ప్ర‌స్తుతం పాల‌న సాగిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్నికల హామీలను నెరవేర్చడానికి సీఎం రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నా, పార్టీ నేతలు ఆయనతో క‌లిసి ప‌ని చేయ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పాలనా అనుభవం లేకపోయినా, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటా బయటా యుద్ధం చేయాల్సిన పరిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని అంటున్నారు.

Advertisement

Telangana Congress : టి. కాంగ్రెస్ ప‌ట్టు త‌ప్పిందా.. అధికారంలోకి వ‌చ్చాక రేవంత్ రెడ్డికి ఏమైంది..!

Telangana Congress రేవంత్‌కి వెన్నుపోటా..!

ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తన ఎన్నికల హామీలను నెరవేర్చడానికి ఆపసోపాలు పడుతోంది. ఇందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులే కారణమన్న వాదన కూడా వినిపిస్తుంది. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే ఉచిత బస్సు ప్రయాణం వాగ్దానాన్ని అమలు చేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచారు. అదేవిధంగా రైతు రుణ మాఫీ చేశారు. రైతు బంధు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం వంటి ఎన్నో హామీలను నెరవేర్చడంతోపాటు పదేళ్లుగా పంపిణీ చేయని రేషన్ కార్డులను కూడా ఇస్తున్న‌రు. అయితే ఇంత చేస్తున్నా కూడా క్యాడ‌ర్ వ‌ల్ల‌నే రేవంత్ రెడ్డి బాగా డ్యామేజ్ అవుతున్నాడ‌నే టాక్ న‌డుస్తుంది.

Advertisement

పథకాలు, ప్రణాళికలపై కాంగ్రెస్ పార్టీ నుంచి తగిన ప్రచారం లభించడం లేదు. ఎక్కడ ప్రజలు ఈ పథకాలను అర్థం చేసుకుని ఆదరిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను లెక్క చేయరో అన్న ఆలోచ‌న త‌మ‌లో ఉందో లేదో తెలియ‌దు కాని ఆయన విజయ ప్రస్థానాన్ని అంగీకరించలేని కొందరు కాంగ్రెస్ నేతలు.. తమ ఇగోతో ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా ప్రవర్తిస్తున్నారని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రతిపక్షానికి అస్త్రం అవ్వగా, తాజాగా పది మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యారనే సమాచారం పెను భూకంపాన్ని తీసుకువచ్చినట్లైంది. తాజా పరిస్థితిపై అధిష్టానం కూడా జోక్యం చేసుకున్నా, కొందరు మంత్రులు తీరు మారడం లేదనే టాక్ న‌డుస్తుంది. మ‌రి దీనిని రేవంత్ రెడ్డి ఎలా డీల్ చేస్తాడ‌నే చ‌ర్చ కూడా న‌డుస్తుంది.

Advertisement

Recent Posts

Rashmika Mandanna : రష్మికని వదలని సల్మాన్… సికిందర్ నెక్స్ట్ సినిమా కూడా ఆమె ఫిక్స్.. ఏం జరుగుతుంది..?

Rashmika Mandanna : బాలీవుడ్ లో మన నేషనల్ క్రష్ రష్మిక బిజీగా మారిపోయింది. యానిమల్ హిట్ తో రష్మిక…

2 hours ago

Nirmala Sitharaman : రైతుల కోసం ‘ధన్ ధాన్య కృషి’ పథకాన్ని ప్రకటించిన నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman  : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala Sitharaman రైతుల కోసం 'ధన్ ధాన్య కృషి' పథకాన్ని…

3 hours ago

Monalisa Bhosle : పుష్ప 2 పోస్టర్ ముందు మోనాలిసా ఫోజులు.. హీరోయిన్ అవ్వగానే లుక్కు మార్చేసిందిగా..!

Monalisa Bhosle : మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ కనిపించి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మోనాలిసా వైరల్ అయిన…

4 hours ago

Nagababu : పెద్దిరెడ్డి, జ‌గ‌న్, ద్వారపూడి.. ఎవ‌రిని వ‌ద‌ల‌కుండా విమ‌ర్శ‌లు కురిపించిన నాగ‌బాబు

Nagababu : జనసేన అగ్రనేత నాగబాబు ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా…

6 hours ago

Property Rights : అల్లుడికి మామ ఆస్తిపై హక్కులు?.. హైకోర్టు తీర్పు

Property Rights : మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక ఆస్తి వివాద కేసులో తన ఉత్తర్వులో, 'తల్లిదండ్రుల పోషణ చట్టం ప్రకారం,…

7 hours ago

Abhishek Sharma : మ‌రో యువ‌రాజ్ మ‌న‌కు దొరికిన‌ట్టేనా.?

Abhishek Sharma : అభిషేక్ శ‌ర్మ‌.. ఈ పేరు ఇప్పుడు నెట్టింట మారుమ్రోగిపోతుంది. నిన్న రాత్రి ఇంగ్లండ్‌తో జ‌రిగిన టీ20లో…

8 hours ago

BRS : కేసీఆర్ మౌనం.. కేటీఆర్, హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు…?

BRS : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన ఏడాది దాటింది. పార్టీపై పట్టు సాధించడానికి పార్టీ అధ్యక్షుడు కె.…

9 hours ago