Nageshwar Rao : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై నేను రాయి విస‌ర‌లేదు.. అదంతా అస‌త్యం.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nageshwar Rao : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై నేను రాయి విస‌ర‌లేదు.. అదంతా అస‌త్యం.. వీడియో !

Nageshwar Rao : ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్ర‌చారం హీటెక్కుతుంది. ఈ క్ర‌మంలో ఒక‌రిపై ఒక‌రు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. మ‌రోవైపు రాళ్లదాడి చేసుకుంటున్నారు. శనివారం సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరగ్గా.. ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదకు ఓ వ్యక్తి రాయి విసిరిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ప‌ర్య‌టిస్తుండ‌గా ఆయనపై రాయి విసిరారు. అయితే ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 April 2024,7:30 pm

ప్రధానాంశాలు:

  •  Nageshwar Rao : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై నేను రాయి విస‌ర‌లేదు.. అదంతా అస‌త్యం..!

Nageshwar Rao : ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్ర‌చారం హీటెక్కుతుంది. ఈ క్ర‌మంలో ఒక‌రిపై ఒక‌రు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. మ‌రోవైపు రాళ్లదాడి చేసుకుంటున్నారు. శనివారం సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరగ్గా.. ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదకు ఓ వ్యక్తి రాయి విసిరిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తెనాలిలో ప‌ర్య‌టిస్తుండ‌గా ఆయనపై రాయి విసిరారు. అయితే ఈ ఘటనలో పవన్‍‌కు ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దుండగుడు విసిరిన రాయి పవన్ కళ్యాణ్‌కు దూరంగా వెళ్లిపడడంతో ప్ర‌మాదం త‌ప్పింది. అయితే రాయి విసిరిన ఆగంతుకుణ్ణి జనసైనికులు, పవన్ కళ్యాణ్ మద్దతుదారులు వెంటనే అదుపులోకి తీసుకొని పోలీసుల‌కి అప్ప‌గించిన‌ట్టు వార్తలు వ‌చ్చాయి.

Nageshwar Rao : అదంతా ఉత్తదే..

అయితే రాయి విసిరిన వ్యక్తి ఎవరు.. ఏ ఉద్దేశంతో అతను రాయి విసిరాడనే దానిపై పోలీసులు దర్యాప్తు జ‌రుపుతున్న స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర విషయం బ‌య‌ట‌కు వ‌చ్చింది..పవన్ కళ్యాణ్ పర్యటనలో రాయి విసిరిన మాట వాస్తవం కాదని పోలీసులకు చిక్కిన నాగేశ్వరావు తెలిపారు. నాగేశ్వరరావు ది గుంటూరు జిల్లా మామిళ్ళపల్లి. తెనాలి కాగా, ఆయ‌న పవన్ కల్యాణ్ పర్యటనకు రావటంతో ఆయన నుంచి షేక్ హ్యాండ్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో తన చేయి తగిలిందని, తనపై వారి బంధువులు దాడి చేయడంతో దాన్ని రాయి దాడిగా మార్చారాని నాగేశ్వరరావు పోలీసులకు తెలిపారు. తన చేయి మహిళకు తగిలితే ఆ ఘటనను రాయి విసిరిన ఘటనగా మార్చేశార‌ని ఆయ‌న పోలీసుల‌కి తెలియ‌జేశారు. అయితే ఆయన చెప్పింది వాస్తవమేనని నిర్ధారించుకున్న అనంతరం పోలీసులు నాగేశ్వరరావును విచారించి వదిలేసినట్లు స‌మాచారం.. నిన్న తెనాలిలో పవన్ పై రాయి దాడి జరిగిందని ప్రచారం జరిగిన నేపథ్యంలో దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు.

Nageshwar Rao ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై నేను రాయి విస‌ర‌లేదు అదంతా అస‌త్యం

Nageshwar Rao : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై నేను రాయి విస‌ర‌లేదు.. అదంతా అస‌త్యం..!

ఇక ఇదిలా ఉంటే జ‌గ‌న్‌పై రాయి దాడి  సంఘ‌ట‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందిస్తూ.. జగన్ రాయి దాడిలో డీజీపీ, ఇంటిలిజెన్స్ ఛీఫ్‌ను తొలగిచాలంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ‘‘వీవీఐపీ కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి… చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలూ కట్టలేదు… చెట్లూ కొట్టలేదు?’’ అని నిలదీశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది