Prashanth Kishore : జగన్‌కు భారీ ఝలక్.. ఈసారి టీడీపీతో కలిసి పని చేయబోతున్న పీకే టీమ్.. ఇదిగో ప్రూఫ్

Prashanth Kishore : పీకే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పీకే అన్నా ప్రశాంత్ కిషోర్ అన్నా ఒక్కటే. 2014 లో బీజేపీ గెలుపులో పీకే టీమ్ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీమ్.. ఏపీలో వైసీపీ కోసం పని చేసింది. వాళ్లు వేసిన స్ట్రాటజీలు, వ్యూహాలు ఫలించాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. నిజానికి.. ఈ మధ్య రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలను పెట్టుకొని వాళ్లతో వ్యూహాలు రచించుకోవడం, అలాగే సొంత సర్వేలు నిర్వహించుకోవడం పరిపాటి అయింది. వైసీపీతో పీకే టీమ్ పని చేసినట్టుగానే.. టీడీపీతో కూడా రాబిన్ శర్మ టీమ్ వర్క్ చేస్తోంది. కానీ.. పీకే టీమ్ అంత సమర్థవంతంగా రాబిన్ శర్మ పని చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గం వ్యాప్తంగా రాబిన్ శర్మ టీమ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు సర్వేలు చేయిస్తున్నారు. ఆ సర్వేల ఆధారంగానే ఎమ్మెల్యే అభ్యర్థులకు టికెట్లు కూడా కేటాయించనున్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల కంటే ముందు కొన్ని రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ కోసం పీకే టీమ్ పని చేసింది. ఆ తర్వాత మధ్యలో ఆ డీల్ ను ఉపసంహరించుకుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ కు నెగెటివిటీ పెరుగుతోందని మళ్లీ కేసీఆర్ పీకేను రంగంలోకి దింపినప్పటికీ పీకే.. బీఆర్ఎస్ తో పని చేయడానికి ఒప్పుకోలేదు.

కట్ చేస్తే తాజాగా టీడీపీ యువనేత నారా లోకేష్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ ఒకే విమానంలో ప్రయాణించారు. అది కూడా ప్రైవేట్ విమానం. ఇద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడకు ఒకే విమానంలో రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయమే ఉంది. ఈనేపథ్యంలో పీకే, నారా లోకేష్ ఇద్దరూ కలిసి ఒకే విమానంలో కలిసి ప్రయాణించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కోసం పీకే టీమ్ పని చేయబోతుందా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిజానికి ఈసారి ఎలాగైనా గెలవాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. టీడీపీ గెలుపు కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం టీడీపీకి అనుకూల వాతావరణమే ఉంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వ్యతిరేకత.. టీడీపీకి కలిసి రానుంది. అలాగే పీకే టీమ్ ను కూడా కలుపుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Prashanth Kishore : టీడీపీ గెలుపు కోసం పీకే టీమ్ పని చేయబోతున్నదా?

అందుకే.. పీకే టీమ్ టీడీపీ గెలుపు కోసం పని చేయబోతున్నదని.. వీళ్లిద్దరి కలయికతో అర్థం అవుతోంది. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కు చెందిన రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ప్రైవేట్ జెట్ లో నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. ప్రయాణంలో ఇద్దరూ కలిసి ఏం మాట్లాడారో తెలియదు కానీ.. పీకే టీమ్ మాత్రం టీడీపీ కోసం పని చేయబోతున్నట్టు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. పీకే టీమ్ తో టీడీపీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. బీజేపీ కూడా త్వరలో వీళ్లతో పాటు కలిసి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో పీకే టీమ్ కూడా ఈ కూటమికి తోడైతే ఇక వైసీపీని ఓడించి సులభంగా ఏపీలో అధికారాన్ని ఛేజిక్కించుకోవచ్చనేది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే.. పీకే టీమ్ తో చర్చించడం కోసమే.. లోకేష్, పీకే.. విజయవాడకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. పీకే టీమ్ టీడీపీ కోసం పని చేస్తే టీడీపీకి చాలా ప్లస్ అవుతుంది. గెలిచే అవకాశాలు ఇంకాస్త పెరుగుతాయి. అయితే.. 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పీకే టీమ్ పని చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పీకే టీమ్ పెద్దగా సీఎం జగన్ తో టచ్ లో లేదు. మళ్లీ ఈసారి ఎన్నికల కోసం మరి జగన్.. పీకే టీమ్ ను కాంటాక్ట్ కాలేదా? వాళ్ల కాంట్రాక్ట్ పూర్తయిందా? మళ్లీ 2024 ఎన్నికల్లో తమతో పని చేయాలని జగన్ ఒప్పందం కుదుర్చుకోలేదా? అందుకే ఈసారి టీడీపీతో కలిసి పీకే టీమ్ పని చేయబోతోందా? అనేదానిపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share

Recent Posts

Struggling With Diabetes : డయాబెటిస్‌తో పోరాడుతున్నారా? రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి పోషకాహార నిపుణుల చిట్కాలు ట్రై చేయండి

Struggling With Diabetes : నేటి ప్రపంచంలో డయాబెటిస్ అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే పెరుగుతున్న ప్రపంచ సమస్యగా…

3 minutes ago

Ice Apple : చ‌ల్ల‌ద‌నంతో పాటు ఆరోగ్యానికి ఈ హాట్ స‌మ్మ‌ర్‌లో ఐస్ ఆపిల్స్‌

Ice Apple : ఐస్ ఆపిల్స్‌ను పామ్ ఫ్రూట్, మరాఠీలో టాడ్గోలా, తమిళంలో నుంగు, గుజరాతీలో తారి, తెలుగులో ముంజ‌లు…

1 hour ago

Chia Seed Benefits : యూఎస్ఏలో సూప‌ర్‌ఫుడ్ హోదా పొందిన ఈ గింజ‌ల ప్ర‌యోజ‌నాలు తెలిస్తే వ‌ద‌ల‌రంతే

Chia Seed Benefits : చియా విత్తనాల ప్రయోజనాల్లో ఎముకలు, పేగులు మరియు హృదయ సంబంధ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం కూడా…

2 hours ago

ADA Recruitment 2025 : డిగ్రీ అభ్య‌ర్థుల‌కు అద్భుత అవ‌కాశం.. ఏడీఏలో అడ్మిన్ అసిస్టెంట్లు, అడ్మిన్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ADA Recruitment 2025 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన ఏరోనాటికల్…

3 hours ago

Loan : ఎలాంటి హామీ లేకుండా మీకు రూ. 20 లక్షల లోన్.. ఎలా అంటే

Loan : ఈ రోజుల్లో వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు డబ్బు అనేది పెద్ద సమస్య గా మారింది. చాలామంది బ్యాంకుల…

16 hours ago

Investment Schemes : ఈ పథకంలో డబ్బులు పెడితే మహిళలకు లాభాలే లాభాలు

Investment Schemes : ఈ రోజుల్లో మహిళలు ఆర్థికంగా మారేందుకు చాలా చైతన్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంటిని నిర్వహించడంలోనే కాదు, భవిష్యత్‌…

17 hours ago

Gas Cylinder Subsidy : మీకు గ్యాస్ సిలిండ‌ర్ సబ్సీడీ ఇంకా అకౌంట్లో ప‌డ‌లేదా.. కార‌ణం ఏంటంటే..!

Gas Cylinder Subsidy : ఇప్పుడు ప్రతి ఇంటిలో వంట గ్యాస్ అనేది తప్పనిసరి అయింది. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల…

18 hours ago

Monalisa : మోనాలిసా మోస‌పోలేదు.. స్పెష‌ల్ సాంగ్‌తో ఎంట్రీ

Monalisa : మహా కుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన అందా భామ‌ మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కి చెందిన…

19 hours ago